
భూసమస్యల పరిష్కారానికి భూభారతి
● కలెక్టర్ కుమార్‌దీపక్
భీమారం: రైతుల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. భీమారం మండలం మద్దికల్, ఆరెపల్లిలో బుధవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మద్దికల్ సదస్సులో మాట్లాడుతూ రైతులు ఇన్నాళ్లు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకవచ్చిందన్నారు. భూములకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే రైతులకు పట్టాదార్ హక్కులు కల్పించనున్నట్లు తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు కార్యచరణ ప్రకారంగా జిల్లాలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందులో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, తహసీల్దా ర్లు సదానందం, కృష్ణ, రైతులు పాల్గొన్నారు.
ఇతరులు పట్టాలు చేసుకున్నారు..
మద్దికల్ రెవెన్యూ శివారులోని మా భూములను వేరే వ్యక్తులు అక్రమంగా పట్టాలు చేసుకున్నారని 20 మంది రైతులు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. తాము ఆభూముల్లో అనేక సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నామని తెలిపారు. మాకు న్యాయం చేయాలని వారు కలెక్టర్‌ని కోరారు.
క్రీడా కిట్లు పంపిణీ
పాతమంచిర్యాల: వేసవి క్రీడా శిబిభిరాలకు క్రీడా కిట్లు పంపిణీ చేశామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. కలెక్టరేట్‌లో జిల్లా క్రీడలు, యువజన శాఖ అధికారి కీర్తిరాజవీర్‌తో కలిసి బుధవారం క్రీడా కిట్లను పంపిణీ చేశారు. బాక్సింగ్ కోచ్ చిలువేరు రాజేశ్, ఫుట్‌బాల్, వాలీబాల్, కరాటే శిక్షకులు పాల్గొన్నారు.