
రోడ్డు ప్రమాదంలో ల్యాబ్ టెక్నీషియన్ మృతి
గంగవరం : మండలంలోని వాడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న మిరియాల బాపన్నదొర (40) గంగవరం శివారులో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ సంఘటనపై ఎస్‌ఐ వెంకటేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వాడపల్లి పీహెచ్‌సీలో విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా గంగవరం సమీపంలో బైక్ నుంచి పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్‌ఐ తెలిపారు. స్థానికులు హుటాహుటిన 108 సమాచారం అందజేయగా, మృతదేహాన్ని అడ్డతీగల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు గురువారం ఉదయం బాపన్నదొర మృతదేహాన్ని అడ్డతీగల ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్టు ఎస్‌ఐ చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు. బాపన్నదొరకు ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. ఆయన అంత్యక్రియులు గంగవరంలో నిర్వహించారు.బాపన్నదొర మృతికి ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ గంగాదేవి, మాజీ ఎంపీపీ తీగల ప్రభ, సర్పంచ్‌లు అక్క మ్మ, రాజమ్మ, వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్‌లు వెంకటేశ్వరరావుదొర, వెంకటేశ్వర్లు దొర, చిన్నాలరావు, బుల్లియమ్మ, వాడపల్లి, గంగవరం పీహెచ్‌సీ వైద్యాధికారులు నిరంజన్, కృష్ణ పవన్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదం దృశ్యం (ఇన్‌సెట్)బాపన్నదొర (ఫైల్)

రోడ్డు ప్రమాదంలో ల్యాబ్ టెక్నీషియన్ మృతి