
కుటీర పరిశ్రమలతోఆర్థిక తోడ్పాటు
● కలెక్టర్ దినేష్‌కుమార్
డుంబ్రిగుడ: కుటీర పరిశ్రమలతో గిరిజన యువతకు ఆర్థిక తోడ్పాటు లభిస్తుందని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అన్నారు. అరకు పంచాయతీలో రూ.9.80 కోట్లతో ఐదు ఎకరాల్లో 36 యూనిట్లతో నిర్మిస్తున్న కుటీర పరిశ్రమకు విజయనగరం ఆర్టీసీ రీజనల్ చైర్మన్ దొన్నుదొరతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో అరకు ప్రాంతం మరింత అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ జి. శారద, సాగర ఎంపీటీసీ దేవదాసు, ఎంపీడీవో ప్రేమ్‌సాగర్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.