
అల్లూరి త్యాగం చిరస్మరణీయం
● కలెక్టర్ దినేష్‌కుమార్
● వర్థంతి సందర్భంగా ఘన నివాళి
సాక్షి,పాడేరు: పీడిత గిరిజన ప్రజల పక్షాన బ్రిటీషు వారిని ఎదురించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు త్యాగం చిరస్మరణీయమని కలెక్టర్ ఏఎస్ దినేష్‌కుమార్ అన్నారు. ఆయన వర్థంతిని బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. దీనిలో భాగంగా అల్లూరి విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజుల్లో మన్యంలో గిరిజనుల జీవితాలు దుర్భరంగా ఉండేవని, అటువంటి సమయంలో మన్యం ప్రజల కష్టాలను కడతేర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కొనేందుకు గిరిజనులకు అండగా అల్లూరి సీతారామరాజు పోరాటాలు చేశారన్నారు. ఆయనకు జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. రంపచోడవరం, చింతపల్లి, రాజవొమ్మంగి, అడ్డతీగల ప్రాంతాలలో పోలీసుస్టేషన్లపై అల్లూరి దాడి ఘటనలు చరిత్రలో నిలిచాయన్నారు. మహనీయుడు అల్లూరి పేరుతో ఏర్పడిన జిల్లాలో పనిచేయడం ఎంతో సంతృప్తిగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ సౌర్యమన్‌పటేల్, ట్రైనీ కలెక్టర్ నాగ వెంకట సాహిత్, డీఆర్వో పద్మలత తదితరులు పాల్గొన్నారు.
అరకులోయలో..
అరకులోయ టౌన్: అల్లూరి గొప్ప పోరాట యోధుడు అని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వర్థంతి కార్యక్రమంలో అల్లూరి చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెట్టి వినయ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమిడి అశోక్, జెడ్పీటీసీ, ఎంపీపీలు చటారి జానకమ్మ, బాక ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.
రంపచోడవరం: అల్లూరి పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో కట్టా సింహాచలం సూచించారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో డీఎన్‌వీ రమణ, డీఈ చైతన్య, ఐటీడీఏ సిబ్బంది పాల్గొన్నారు.

అల్లూరి త్యాగం చిరస్మరణీయం

అల్లూరి త్యాగం చిరస్మరణీయం