Sanjiv Goenka
-
IPL 2025: ఈ పంత్ మనకొద్దు, పీకి పడేయండి సార్..! విసుగెత్తిపోయిన లక్నో అభిమానులు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ దారుణ ప్రదర్శన కొనసాగుతుంది. ఈ సీజన్లో అతను ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 128 పరుగులు (99.22 స్ట్రయిక్ రేట్‌తో) మాత్రమే చేశాడు. నిన్న (మే 4) పంజాబ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 17 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 18 పరుగులు చేసి అసాధారణ రీతిలో ఔటయ్యాడు.Bat goes in the air 🎙️🎙️pic.twitter.com/ySjmdC9qMm— CricTracker (@Cricketracker) May 4, 2025అజ్మతుల్లా బౌలింగ్‌లో ముందుకు వచ్చి భారీ షాట్‌కు ప్రయత్నించగా.. బ్యాట్ ఓ పక్క, బంతి ఓ పక్క గాల్లోకి లేచాయి. శశాంక్ సింగ్ క్యాచ్ పట్టడంతో పంత్ నిరాశగా పెవిలియన్‌కు వెనుదిరిగాడు. పంత్ విచిత్ర రీతిలో ఔటైన అనంతరం లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా కూడా చాలా దిగాలుగా, కోపంగా కనిపించాడు. Sanjiv Goenka Reaction After Rishabh Pant wicket 🥵#LSGvsPBKS #PBKSvsLSG pic.twitter.com/jUeuVlqz6n— MAHIPAL GURJAR (@Chikugurjar83) May 4, 2025ఈ పంత్ ఇక మారడా అన్నట్లు హావభావాలు పెట్టాడు. గొయెంకా ఎక్స్‌ప్రెషన్స్‌ను సోషల్‌మీడియాలో అభిమానులు మీమ్స్‌గా వాడుకుంటున్నారు. గొయెంకా ఓపిక నశించింది. ఇక పంత్‌కు బడిత పూజే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.మరోవైపు పంత్ వరుస వైఫల్యాల నేపథ్యంలో లక్నో అభిమానులు విసుగెత్తిపోయారు. ఈ పంత్ మనకొద్దు, తక్షణమే జట్టు నుంచి తొలగించండంటూ లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకాను అభ్యర్థిస్తున్నారు. పంత్‌పై రూ. 27 కోట్ల పెట్టుబడి సుద్ద దండగ అని కామెంట్లు చేస్తున్నారు. If you were Sanjiv Goenka, what would you have done?1. Release Rishabh Pant and invest 27cr into other players in auction2. Release Rishabh Pant and and buy him back for a cheaper price3. Reinvest 27 cr for another season? pic.twitter.com/xtPQ4jhOla— Dinda Academy (@academy_dinda) May 4, 2025కాగా, ఈ సీజన్ మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా పంత్ రికార్డుల్లోకెక్కాడు. అయితే ఈ సీజన్లో పంత్ తీసుకున్న డబ్బుకు కనీస న్యాయం కూడా చేయలేకపోతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో ఘెరంగా విఫలమై అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాడు. 2016లో అరంగేట్రం చేసిన తర్వాత ఐపీఎల్లో పంత్ ఇంత ఘోరమైన ప్రదర్శనలు ఎప్పుడూ చేయలేదు.ఈ సీజన్లో పంత్ కెప్టెన్‌గానూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. తొలి 6 మ్యాచ్‌ల్లో టాపార్డర్ ఆటగాళ్లు చెలరేగడంతో లక్నో 4 విజయాలు సాధించింది. అయితే గడిచిన ఐదు మ్యాచ్‌ల్లో టాపార్డర్ అంతంతమాత్రంగా ఆడుతుండటంతో పంత్ కెప్టెన్సీ లోపాలు బయటపడ్డాయి. చివరి ఐదు మ్యాచ్‌ల్లో లక్నో నాలుగింట ఓడింది. పంత్ జట్టును గెలిపించే ఒక్క మంచి నిర్ణయం కూడా తీసుకోలేకపోయాడు. పైగా బ్యాటింగ్ ఆర్డర్లో తనను తాను వెనక్కు పంపుకోవడం లాంటి చెత్త నిర్ణయాలు తీసుకున్నాడు. ఛాంపియన్ జట్టుకు కావాల్సిన అన్ని వనరులు ఉన్నా పంత్ సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు.వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా ఇంతలా విఫలమవుతున్న పంత్‌పై యజమానిగా గొయెంకాకు కోపం రావడం సహజమే. పైగా పంత్ కోసం అతను కేఎల్ రాహుల్ లాంటి గొప్ప ప్లేయర్‌ను కాదనుకున్నాడు. లక్నో అభిమానుల బాధలోనూ అర్దముంది. జట్టు బాగాలేకపోతే ఏదో అనుకునే వారు. అన్నీ బాగున్నా జట్టును విజయపథంలో నడిపించలేకపోతే అది కెప్టెన్ వైఫల్యమే అవుతుంది. అందుకే వారు ఈ స్థాయిలో పంత్‌పై రియాక్ట్ అవుతున్నారు. కాగా, నిన్న (మే 4) రాత్రి జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) రెచ్చిపోవడంతో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో.. టాపార్డర్ ఘోరంగా విఫలం కావడంతో లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఆయుశ్ బదోని (40 బంతుల్లో 74; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (24 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ప్రతిఘటించడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేయగలిగింది.ఈ ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. లక్నో ఇకపై ఆడాల్సిన మూడు మ్యాచ్‌లు గెలిచినా ఇతర జట్ల జయాపజయాలపై వారి ఫేట్ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం లక్నో రన్ రేట్ (-0-469) కూడా చాలా తక్కువగా ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న జట్లలో ఈ ఒక్క జట్టు రన్‌రేట్ మాత్రమే మైనస్‌లో ఉంది. లక్నో ఒక వేళ మూడు మ్యాచ్‌లు గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కాలంటే భారీ తేడాతో గెలవాలి. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 10 పాయింట్లు (11 మ్యాచ్‌ల్లో 5 విజయాలు) ఉన్నాయి. పంజాబ్ చేతిలో ఓటమితో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పడిపోయింది. -
LSG VS DC: ఇది కదా ప్రతీకారమంటే.. లక్నో ఓనర్‌కు ఇచ్చి పడేసిన రాహుల్
గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకా తన పట్ల వ్యవహరించిన తీరుకు నాటి లక్నో కెప్టెన్, ప్రస్తుత ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ తనదైన శైలిలో బదులిచ్చాడు. నిన్న (ఏప్రిల్ 22) ఎల్ఎస్జీపై విజయానంతరం గొయెంకా కరచాలనం చేస్తూ తనతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. రాహుల్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. రాహుల్ చర్యకు గొయెంకా సహా మైదానంలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇదేంటబ్బా రాహుల్ ఇలా ప్రవర్తించాడని అనుకున్నారు.THE COMEBACK MAN - KL RAHUL. 🦁 pic.twitter.com/EQ67LvjLVl— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2025అయితే దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. గత సీజన్లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమి అనంతరం గొయెంకా రాహుల్‌ను బహిరంగంగా అవమానించాడు. అందరి ముందు నిలదీశాడు. గొయెంకా చర్యకు మనసు నొచ్చుకున్న రాహుల్ లక్నోను వీడి ఢిల్లీ పంచన చేరాడు. ఇప్పుడు అవకాశం రావడంతో లక్నో ఓనర్‌కు తన ఆటతీరుతోనే బుద్ది చెప్పాడు. తనను ఘోరంగా అవమానించిన గొయెంకాపై వారి సొంత మైదానంలోనే ప్రతీకారం తీర్చుకున్నాడు. Sanjeev Goenka tried to stop KL Rahul, but Rahul rejected any interaction. pic.twitter.com/1aQ68CIcic— Himanshu Pareek (@Sports_Himanshu) April 22, 2025నిన్న (ఏప్రిల్ 22) ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి ఢిల్లీని గెలిపించాడు. సిక్సర్‌తో మ్యాచ్ ముగించి గొయెంకాకు తానేమి చేయగలనో నిరూపించాడు. ఈ సీజన్లో లక్నోపై ఢిల్లీకి ఇది రెండో విజయం. వైజాగ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఢిల్లీ లక్నోను చిత్తు చేసింది. అయితే తన భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో రాహుల్ ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. సీజన్ ప్రారంభం నుంచే గొయెంకాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూసిన రాహుల్.. నిన్న అవకాశం రావడంతో తన దెబ్బను రుచి చూపించాడు. ఈ సీజన్లో రాహుల్ మాంచి కసితో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 323 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో రాహుల్ ఓ భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.ఎల్ఎస్జీలో రాహుల్ ప్రస్తానంలక్నో ఐపీఎల్ అరంగేట్రం నుంచి కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్.. తొలి రెండు సీజన్లలో (2022, 2023) ఆ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. అయితే గత సీజన్లో రాహుల్ లక్నోను ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. గత సీజన్లో నెమ్మదిగా ఆడుతున్నాడని కూడా రాహుల్‌పై విమర్శలు వచ్చాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్ (45), ఆయుశ్ బదోని (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. -
రూ. 27 కోట్లు.. కనీసం 27 పరుగులైనా చేయవా? పంత్‌కు గోయెంకా క్లాస్? (ఫోటోలు)
-
రూ. 27 కోట్లు దండుగ!.. పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులకెక్కాడు టీమిండియా స్టార్ రిషభ్ పంత్ (Rishabh Pant). ఐపీఎల్-2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ ఈ వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 27 కోట్లు ఖర్చు చేసింది. ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ పంత్‌ను సొంతం చేసుకుని.. జట్టు పగ్గాలు అప్పగించింది.అయితే, లక్నో సారథిగా తొలి మ్యాచ్‌లోనే పంత్ విఫలమయ్యాడు. బ్యాటర్‌గా, వికెట్ కీపర్‌గా స్థాయికి తగ్గట్లు రాణించలేక.. గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. ఇక రెండో మ్యాచ్‌లో మాత్రం పంత్‌కు ఊరట దక్కింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో లక్నో గెలుపొందడంతో అతడు తొలి విజయం అందుకున్నాడు. అయితే, సొంత మైదానంలో మాత్రం మళ్లీ పాత కథే పునరావృతమైంది.పంజాబ్ కింగ్స్(Punjab Kings)తో మంగళవారం నాటి మ్యాచ్‌లో లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. సమిష్టి వైఫల్యం కారణంగా హోం గ్రౌండ్లో తొలి మ్యాచ్‌లోనే పరాజయాన్ని చవిచూసింది. ఇక ఇప్పటి వరకు లక్నో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ పంత్ బ్యాటర్‌గా విఫలం కావడం తీవ్ర విమర్శలకు దారితీసింది.బ్యాటర్‌గా విఫలంతొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో రిషభ్ పంత్ ఆరు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. రెండో మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌తో పోరులో పదిహేను బంతుల్లో పదిహేను పరుగులు చేయగలిగాడు. ఇక తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో ఐదు బంతులు ఎదుర్కొని కేవలం రెండే పరుగులు చేసి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో పంత్ బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రూ. 27 కోట్లు దండుగ!‘‘పంత్‌కు ఏమైంది? హ్యాట్రిక్ అట్టర్‌ఫ్లాప్‌లు.. రూ. 27 కోట్లు.. లక్నో బూడిదలో పోసినట్లే..’’ అంటూ సోషల్ మీడియా వేదికగా పంత్‌పై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. మరోవైపు.. ప్రతి మ్యాచ్ తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా పంత్‌తో సంభాషిస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.గట్టిగానే క్లాస్ తీసుకున్న గోయెంకాతాజాగా పంజాబ్‌తో మ్యాచ్ తర్వాత కూడా గోయెంకా పంత్‌కు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పంత్ చేతులు కట్టుకుని నిలబడగా.. అతడి వైపు వేలు చూపిస్తూ మరీ గోయెంకా సీరియస్ అయిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గోయెంకా తీరుపై కూడా ట్రోల్స్ వస్తున్నాయి. గతంలో కేఎల్ రాహుల్‌తో ఇలాగే వ్యవహరించిన తీరును గుర్తుచేస్తూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.‘‘విజయాల కంటే కూడా ఇలాంటి వివాదాలతోనే హైలైట్ కావాలని చూసే ఓనర్ ఈయన ఒక్కడేనేమో! ప్రతి మ్యాచ్ తర్వాత ఇలా కెప్టెన్‌తో అందరి ముందే సంభాషిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా బిల్డప్ ఇవ్వడం ద్వారా ఏం నిరూపించాలనుకుంటున్నారు? డబ్బులు పెట్టి కొన్నంత మాత్రాన వారిని తక్కువ చేసి చూపడం సరికాదు’’ అంటూ హితవు పలుకుతున్నారు.ఐపీఎల్-2025: లక్నో వర్సెస్ పంజాబ్ స్కోర్లు👉వేదిక: భారత రత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం, లక్నో👉టాస్: పంజాబ్.. తొలుత బౌలింగ్👉లక్నో స్కోరు: 171/7 (20)👉పంజాబ్ స్కోరు: 177/2 (16.2)👉ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో లక్నోపై పంజాబ్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69).చదవండి: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు నో ఛాన్స్! కెప్టెన్ ఎవరంటే?Statement victory ✅Skipper's second 5⃣0⃣ this season ✅Consecutive wins ✅Punjab Kings cap off a perfect day 🙌#TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/HSrX8KwiY4— IndianPremierLeague (@IPL) April 1, 2025 -
IPL 2025: పంత్‌కు లక్నో ఓనర్ క్లాస్..? రాహుల్ ఉదంతాన్ని గుర్తు చేసిన సీన్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మార్చి 24) జరిగిన రసవత్తర మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ షాకింగ్ ఓటమికి గురైంది. ఈ మ్యాచ్‌లో లక్నో గెలుపుకు సువర్ణావకాశాలు లభించినా ఒడిసి పట్టుకోలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేస్తూ అతి భారీ స్కోర్ చేసే అవకాశం (14 ఓవర్లలోనే 161 పరుగులు) వచ్చినా 209 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఛేదనలో 113 పరుగులకే 6 వికెట్లు తీసినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. ఆశుతోష్ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), విప్రాజ్ నిగమ్ (15 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఢిల్లీని గెలిపించారు.ఈ మ్యాచ్‌లో లక్నో ఓటమికి కెప్టెన్ పంత్ ప్రధాన కారకుడయ్యాడు. తొలుత బ్యాటింగ్‌లో 6 బంతులాడి డకౌట్ అయిన పంత్.. ఆతర్వాత ఛేదనలో అత్యంత కీలక సమయంలో స్టంపింగ్ మిస్ చేసి ఢిల్లీకి మ్యాచ్‌ను వదిలేశాడు. 9 వికెట్లు కోల్పోయిన ఢిల్లీకి చివరి ఓవర్లో గెలుపుకు 6 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి పంత్ మొహిత్ శర్మను స్టంపౌట్ చేసే సువర్ణావకాశాన్ని జారవిడిచాడు. ఆతర్వాతి బంతికి సింగిల్ తీసిన మోహిత్ అశుతోష్‌కు స్ట్రయిక్ ఇచ్చాడు. అప్పటికే జోష్‌లో ఉండిన అశుతోష్ మూడో బంతిని సిక్సర్‌గా మలిచి ఢిల్లీకి అపురూప విజయాన్నందించాడు.Bro ! Pant you lost the match here ! Misses the match stumping ! #LSGvsDC #IPL2025 #RishabhPant #starc #NupurSharma #kunalkamra #HarbhajanSingh #NicholasPooran #asutosh pic.twitter.com/BjzoJN0mQM— fart cat 🐱 smokimg🚬 (@gajendra87pal) March 24, 2025మ్యాచ్ అనంతరం లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా కెప్టెన్ పంత్ ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు కనిపించాడు. గొయెంకా-పంత్ వాడి వేడిగా చర్చిస్తున్నట్లు కనిపించే దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. వారి మధ్య సంభాషణ గతేడాది కేఎల్ రాహుల్ ఉదంతాన్ని గుర్తు చేసింది. గత సీజన్లో ఎస్ఆర్హెచ్ చేతిలో ఓటమి అనంతరం గొయెంకా నాటి కెప్టెన్ రాహుల్‌ను దుర్భాషలాడినట్లు ప్రచారం జరిగింది. తాజా ఓటమి తర్వాత గొయెంకా పంత్‌పై కూడా అదే రేంజ్లో ఫైరయ్యాడని టాక్ నడుస్తుంది. ఈ ఘటన కారణంగానే రాహుల్ లక్నోను వీడాడన్నది కాదనలేని సత్యం. ఈ విషయంపై రాహుల్ ఎక్కడా నోరు విప్పకపోయినా ఆ సీన్ చూసిన జనాలకు విషయం ఇట్టే అర్దమవుతుంది. Once a toxic Manager always a toxic Manager #DCvLSGRishabh Pant #KLRahul Sanjiv Goenka pic.twitter.com/MmFZ4MlCRq— Ex Bhakt (@exbhakt_) March 24, 2025రాహుల్‌ను కాదనుకునే పంత్‌ను తెచ్చిపెట్టుకున్న గొయెంకా ఇప్పుడు అతనితోనూ అలాగే ప్రవర్తిస్తున్నట్లున్నాడు. ఇదే రిపీటైతే పంత్ కూడా వచ్చే సీజన్లో లక్నోకు టాటా చెప్పడం ఖాయం. కాగా, పంత్‌ను గొయెంకా ఈ సీజన్ మెగా వేలంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర (రూ. 27 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకున్నాడు. పంత్ గత సీజన్ వరకు ఢిల్లీకి ఆడాడు. ఢిల్లీతో ఉన్న అనుబంధం ఇంకా తగ్గలేదో ఏమో మరి, ఈ మ్యాచ్‌లో పంత్ తన స్థాయి మేరకు రాణించలేకపోయాడు. ఇదే కొనసాగితే పంత్ మహా కోపిష్టి అయిన గొయెంకా చేతిలో మున్ముందైనా అవమానాలకు గురి కావల్సి ఉంటుంది. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ను వైజాగ్‌లో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ మార్చి 30న మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. -
మరో క్రికెట్ లీగ్‌లోకి అడుగుపెట్టిన లక్నో సూపర్ జెయింట్స్
ఐపీఎల్ (IPL) టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మరో క్రికెట్ లీగ్‌లోకి అడుగుపెట్టింది. ఎల్ఎస్జీ యాజమాన్యం హండ్రెడ్ లీగ్‌లోని (The Hundred League) మాంచెస్టర్ ఒరిజినల్స్ (ఇంగ్లండ్) ఫ్రాంచైజీని కళ్లు చెదిరే ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఫ్రాంచైజీ మొత్తం విలువలో 49 శాతాన్ని ఎల్ఎస్జీ యాజమాన్యమైన RPSG గ్రూప్ దక్కించుకుంది. భారత కరెన్సీలో ఈ వాటా విలువ రూ. 1251 కోట్లు. మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో (Manchester Originals) వాటా దక్కించుకున్న విషయాన్ని RPSG గ్రూప్ అధినేత సంజీవ్ గొయెంకా వెల్లడించారు. తొలుత ఎల్ఎస్జీ యాజమాన్యం హండ్రెడ్ లీగ్‌లోని మరో ఫ్రాంచైజీ (లండన్ స్పిరిట్) కోసం బిడ్ దాఖలు చేసింది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అంతిమంగా RPSG గ్రూప్ మాంచెస్టర్ ఒరిజినల్స్‌లో వాటా దక్కించుకుంది. RPSG గ్రూప్‌తో జత కట్టడంపై మాంచెస్టర్ యాజమాన్యం లంకాషైర్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ డీల్‌లో టర్మ్స్ అండ్ కండీషన్స్‌పై తదుపరి 8 వారాల్లో చర్చిస్తామని పేర్కొంది.కాగా, ఇటీవలే హండ్రెడ్ లీగ్‌లోకి మరో ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా అడుగుపెట్టింది. ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ (అంబానీ గ్రూప్).. ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఫ్రాంచైజీని భారీ ధరకు కొనుగోలు చేసింది. మరో రెండు ఐపీఎల్ ఫ్రాంచైజీలు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా హండ్రెడ్ లీగ్‌లో ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఎస్ఆర్హెచ్కు చెందిన సన్ గ్రూప్.. నార్త్రన్ సూపర్ ఛార్జర్స్, ట్రెంట్ రాకెట్స్‌ను కొనుగోలు చేయాలని చూస్తుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని అయిన జీఎమ్ఆర్ గ్రూప్ సథరన్ బ్రేవ్‌లో వాటాను దక్కించుకునేందుకు ఆసక్తి కనబరుస్తుంది.అప్పట్లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్..లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీ తెరమరుగైంది. రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌కు ఎంఎస్ ధోని సారధిగా వ్యవహరించాడు. 2021లో సంజీవ్ గొయెంకాకు చెందిన RPSG గ్రూప్.. లక్నో సూపర్ జెయింట్స్‌ను రూ. 7090 కోట్లకు కొనుగోలు చేసింది. 2023లో RPSG గ్రూప్.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (SA20) డర్బన్ సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీని కూడా కొనుగోలు చేసింది. -
కేఎల్ రాహుల్‌పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకాపై కేఎల్ రాహుల్ అభిమానులు మండిపడుతున్నారు. కెప్టెన్ పట్ల మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంతకు ముందు ఏ జట్టు ఓనర్ కూడా ఇలా ప్రవర్తించినట్లు చూడలేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఐపీఎల్-2024లో భాగంగా లక్నో జట్టు బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడింది. టాస్ గెలిచిన లక్నో సారథి కేఎల్ రాహుల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, సొంత మైదానం ఉప్పల్‌లో ప్యాట్ కమిన్స్ బృందం సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది.సన్‌రైజర్స్ బౌలర్లు, ఫీల్డర్ల అద్భుత ప్రదర్శన కారణంగా లక్నో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 165 పరుగులకు పరిమితమైంది. కేఎల్ రాహుల్(29), కృనాల్ పాండ్యా(24) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. నికోలస్ పూరన్(26 బంతుల్లో 48*), ఆయుశ్ బదోని(30 బంతుల్లో 55*) అద్భుతంగా రాణించారు.అయితే, లక్నో విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఉఫ్‌మని ఊదేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(28 బంతుల్లో 75), ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 89) పరుగుల వరద పారించి.. 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను గెలిపించారు. వీరిని కట్టడి చేసేందుకు లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ అమలు చేసిన వ్యూహాలలో ఒక్కటీ ఫలితాన్నివ్వలేదు.ఈ నేపథ్యంలో ఘోర ఓటమి అనంతరం లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్‌తో వాదనకు దిగాడు. అందరూ చూస్తుండగానే సీరియస్‌గా రాహుల్‌కు క్లాస్ తీసుకున్నాడు.కెప్టెన్ వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా.. ‘‘సాకులు చెప్పొద్దు.. నేను సహించను.. ఆ రెండు పాయింట్లు ఎంత ముఖ్యమో తెలుసు కదా’’ అన్నట్లుగా కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.Mr Goenka is a pathetic owner.I support KL Rahul 100%Repost and show your support towards #KLRahul #SRHvLSG #PBKSvRCB #PBKSvsRCBpic.twitter.com/JUYv9AgVdd— Samira (@Logical_Girll) May 9, 2024 ఈ నేపథ్యంలో సంజీవ్ గోయెంకా ప్రవర్తనను రాహుల్ ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. కాగా ప్లే ఆఫ్స్ రేసులో సాఫీగా ముందుకు వెళ్లాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో చిత్తుగా ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి ఆరో స్థానంలోనే నిలిచిపోయింది. మరోవైపు సన్‌రైజర్స్ మూడో స్థానానికి దూసుకువచ్చింది.చదవండి: SRH: వాళ్లిద్దరు పిచ్‌ను మార్చేశారు.. అతడొక అద్భుతం.. నమ్మలేకపోతున్నా! WHAT. A. CHASE 🧡A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare! Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK— IndianPremierLeague (@IPL) May 8, 2024 -
స్టార్ క్రికెటర్ కోహ్లీ పార్టనర్, ఈ బిలియనీర్ గురించి తెలుసా? నెట్‌వర్త్ ఎంతంటే?
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆటగాడిగానే కాదు దేశవ్యాప్తంగా అనేక వ్యాపారాలు, స్టార్టప్స్‌లో పెట్టుబడుల ద్వారా రాణిస్తున్నాడు. కోహ్లి ముఖ్యమైన వ్యాపార భాగస్వాములలో ఒకరు. బిలియనీర్ గురించి తెలుసా మీకు. ప్రత్యర్థి ఐపీఎల్ టీం ఓనరుతో కోహ్లి మధ్య వ్యాపార సంబంధాలు ఏంటో ఒకసారి చూద్దాం! ఆయన ఎవరోకాదు రూ. 7,090 కోట్ల ఐపీఎల్ టీం ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గొయెంకా దేశీయ దిగ్గజం కంపెనీ మల్టీ బిలియన్డాలర్ల విలువైన ఆర్పీ గోయెంకా గ్రూప్ చైర్మన్ కూడా. ఈ కంపెనీ పవర్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ మీడియా, ఎంటర్టైన్మెంట్, విద్య వంటి అనేక పరిశ్రమలలో విస్తరించి ఉంది. ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రత్యర్థి జట్టు ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయంకాతో అనేక వ్యాపారాల్లో జతకట్టడంతో పాటు ఇతర భాగస్వామ్యాలు కూడా ఉన్నాయి. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) 2017నుంచి కోహ్లీ ఫౌండేషన్, ఆర్పీసంజీవ్ ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ అవార్డ్స్ కోసంవిరాట్,సంజీవ్ జత కట్టారు. అలాగే పలు వ్యాపార వెంచర్లలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. అంతేకాదు కోహ్లీ, గోయంకా ద్వయం సెలబ్రిటీ గోల్ఫ్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం విశేషం దీంతో దాదాపు రూ. 50వేల కోట్ల ఆస్తి, రూ. 35,451 కోట్ల స్థిరమైన ఆదాయంతో ఆలరారుతున్న సంజీవ్ గోయెంకా ఆర్పీఎస్జీ గ్రూప్ నేతృత్వంలోని ప్రముఖ స్నాకింగ్ బ్రాండ్ ‘టూ యమ్’కి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా విరాట్ కోహ్లీ ఉండటం గమనార్హం. (ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో) దీంతో పాటు ఐఎస్ఎల్ ఫుట్‌బాల్ జట్టు , ఏటీకే మోహన్ బగాన్ ఫుడ్ బాల్ క్లబ్ ఓనరు కూడా .2023 నాటికి, ఆర్పీఎస్జీ గ్రూప్ గ్రూప్ ఆదాయం 4.3 బిలియన్ల డాలర్లకు పైమాటే. అంటూ దాదాపు రూ. 35,451 కోట్లకు పైనే. ఫోర్బ్స్ ప్రకారం, సంజీవ్ గోయెంకా వ్యక్తిగత నికర విలువ రూ. 17,300 కోట్లు. ఫోర్బ్స్ 2022 నివేదిక ప్రకారం భారతదేశంలో 83వ అత్యంత సంపన్నుడు, మొత్తం ప్రపంచంలో 1238వ స్థానంలో ఉన్నారు. సంజీవ్ గోయెంకా ఎక్కడ పుట్టారు 1961, జనవరి 29న పశ్చిమ బెంగాల్, కోల్‌కతాలో వ్యాపారవేత్త రామ ప్రసాద్ గోయెంకా, సుశీలా దేవి దంపతులకు జన్మించారు. -
గౌతమ్ గంభీర్‌కు మరిన్ని కీలక బాధ్యతలు
ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) మెంటార్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌కు ఆ జట్టు యాజమాన్యం మరిన్ని కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీఎస్జీ గ్రూప్ అధినేత సంజీవ్ గొయెంకా యజమానిగా వ్యవహరిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తమ ఆధీనంలో ఉన్న అన్ని సూపర్ జెయింట్స్ జట్లకు గంభీర్‌ను గ్లోబల్ మెంటార్‌గా నియమిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆర్పీఎస్జీ గ్రూప్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీతో (ఐపీఎల్) పాటు డర్బన్ ఫ్రాంచైజీ (సౌతాఫ్రికా టీ20 లీగ్) కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆర్పీఎస్జీ గ్రూప్ తాజా నిర్ణయంతో గంభీర్‌కు ఎల్ఎస్జీ మెంటార్షిప్తో పాటు డర్బన్ ఫ్రాంచైజీ మెంటార్షిప్ కూడా దక్కనుంది. గడిచిన ఐపీఎల్ సీజన్లో గంభీర్ పనితనాన్ని మెచ్చి గ్లోబల్ మెంటార్ ఫర్ క్రికెట్ ఆపరేషన్స్ గా నియమించినట్లు ఆర్పీఎస్జీ గ్రూప్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ప్రస్తుత తరంలో చురుకైన క్రికెటింగ్ పరిజ్ఞానం కలిగిన వ్యక్తుల్లో గంభీర్ ముఖ్యుడని ఆర్పీఎస్జీ పేర్కొంది. కాగా, గంభీర్ ఆధ్వర్యంలో ఎల్ఎస్జీ గడిచిన ఐపీఎల్లో అంచనాలకు మించి రాణించిన విషయం తెలిసిందే. కేఎల్ రాహుల్ నేతృత్వంలో ఏ మాత్రం అంచనాలు లేని ఎల్ఎస్జీని గంభీర్ అన్నీ తానై ముందుండి నడిపించాడు. యువ ఆటగాళ్లను సానబెట్టడంలో గంభీర్ సక్సెస్ కావడంతో ఎల్ఎస్జీ గత సీజన్లో టాప్-4లో నిలిచింది. ఆర్పీఎస్జీ గ్రూప్ ఆధ్వర్యంలోని డర్బన్ ఫ్రాంచైజీ వచ్చే ఏడాది జనవరి నుంచి దక్షిణాఫ్రికా వేదికగా జరుగబోయే ఎస్ఏ20 లీగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇక్కడ పాల్గొనే ఆరు జట్లను ఐపీఎల్ యాజమాన్యలే చేజిక్కించుకోవడంతో ఈ లీగ్‌ను మినీ ఐపీఎల్‌గా అభిమానులు పిలుచుకుంటున్నారు. ఇదిలా ఉంటే, భారత్‌లో ఇటీవల ముగిసిన లెజెండ్స్ లీగ్ క్రికెట్లో గంభీర్ ఇండియా క్యాపిటల్స్ జట్టును విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. -
కేఎల్ రాహుల్ ఐపీఎల్ జట్టు పేరు ఖరారు..
Sanjeev Goenka Revealed Lucknow Franchise Name: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ అయిన లక్నో.. తమ జట్టు పేరును అధికారికంగా ప్రకటించింది. సంజీవ్ గొయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్జీ సంస్థ.. తమ జట్టుకు ‘లక్నో సూపర్ జెయింట్స్’ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఫ్రాంచైజీ అధినేత సంజీవ్ గొయెంకా సోమవారం ట్విటర్ వేదికగా వెల్లడించారు. లక్నో జట్టుకు పేరు ఖరారు చేసేందుకు ట్విట్టర్ వేదికగా ఓ పోల్‌ను నిర్వహించిన ఆర్పీఎస్జీ.. లక్నో వాసులే పేరును సూచించాలని కోరింది. Team owner, Dr. Sanjiv Goenka, Chairman @rpsggroup unveils the name for the Lucknow IPL team. 😊👏🏼#LucknowSuperGiants #NaamBanaoNaamKamao #IPL2022 @IPL @BCCI @GautamGambhir @klrahul11 pic.twitter.com/TvGaZlIgFR — Lucknow Super Giants (@TeamLucknowIPL) January 24, 2022 కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరించనున్న ఈ జట్టుకు జింబాబ్వే మాజీ వికెట్ కీపర్ ఆండీ ఫ్లవర్ హెడ్ కోచ్‌గా, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మెంటార్‌గా ఎంపికయ్యారు. ఈ జట్టులో మార్కస్ స్టొయినిస్ (ఆస్ట్రేలియా), రవి బిష్ణోయ్‌లను సభ్యులుగా ఉన్నారు. ఈ ఫ్రాంచైజీని రూ. 7,090 కోట్ల భారీ మొత్తం వెచ్చింది దక్కించుకున్న ఆర్పీఎస్జీ సంస్థ.. తమ పాత జట్టు ‘రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్’ లో ఊరు పేరు మాత్రమే మార్చి ‘లక్నో సూపర్ జెయింట్స్’గా ఖరారు చేయడం విశేషం. And here it is, Our identity, Our name.... 🤩🙌#NaamBanaoNaamKamao #LucknowSuperGiants @BCCI @IPL @GautamGambhir @klrahul11 pic.twitter.com/OVQaw39l3A — Lucknow Super Giants (@TeamLucknowIPL) January 24, 2022 చదవండి: దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపై టీమిండియా హెడ్ కోచ్ కీలక వ్యాఖ్యలు -
IPL 2022: ఐపీఎల్లో గంభీర్ ‘రీ ఎంట్రీ’.. ఈసారి కొత్త అవతారంలో..
IPL 2022- Lucknow: ఐపీఎల్-2022 సీజన్‌తో రెండు కొత్త ఫ్రాంఛైజీలు క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. లక్నో, అహ్మదాబాద్ పేరిట టీమ్‌ల రాకతో వచ్చే సీజన్ నుంచి పది జట్లు పోటీపడనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే మెగా వేలం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండగా... కొత్త ఫ్రాంఛైజీలు కోచ్‌లు, మెంటార్లను నియమించుకునే పనిలో పడ్డాయి. సంజీవ్ గోయెంకా గ్రూపు నేతృత్వంలోని లక్నో ఇప్పటికే జింబాబ్వే మాజీ సారథి ఆండీ ఫ్లవర్‌ను కోచ్‌గా ఎంపిక చేసింది. ఇక ఇప్పుడు టీమిండియా మాజీ ఓపెనర్, ఎంపీ గౌతమ్ గంభీర్‌ను మెంటార్‌గా నియమించుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు సంజీవ్ గోయెంక క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... ‘‘అవును.. మేము అతడి(గంభీర్)ని నియమించుకున్నాం. క్రికెటర్‌గా అతడు ఎన్నో రికార్డులు సాధించాడు. అతడి పట్ల నాకెంతో గౌరవం ఉంది. తనతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ’’ అని పేర్కొన్నారు. ఇక గంభీర్ ఈ విషయం గురించి చెబుతూ... ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్పీఎస్జీ గ్రూపు, డాక్టర్ గోయెంకాకు ధన్యవాదాలు. పోటీ ఏదైనా సరే... విజేతగా నిలవాలనే కసి నాలో అలాగే ఉంది. పూర్తి నిబద్ధతతో నా విధిని నిర్వర్తిస్తా’’అని చెప్పుకొచ్చాడు. కాగా సంజీవ్ గోయెంక, గంభీర్‌కు మధ్య సత్సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఇక ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిళ్లు అందించిన గంభీర్.. ఆ తర్వాత ఢిల్లీకి సారథ్యం వహించాడు. ఈ లీగ్‌లో తన పేరిట పలు రికార్డులు నమోదు చేశాడు. -
ఫస్ట్ సోర్స్ లాభం 46 శాతం అప్
న్యూఢిల్లీ: బీపీవో సర్వీసుల దిగ్గజం ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ సంస్థ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 2013-14 నాలుగో ఆర్థిక సంవత్సరంలో రూ. 58.8 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ. 40.2 కోట్లతో పోలిస్తే ఇది సుమారు 46 శాతం అధికం. మరోవైపు, ఆదాయం 11 శాతం పెరిగి రూ. 796 కోట్లుగా నమోదైంది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల సంఖ్యను 2,280 మేర తగ్గించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 27,666కి పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 4,200 మేర తగ్గింది. మరోవైపు, ఆదాయం 10% పెరిగి రూ. 3,105 కోట్లకు, లాభం 31 శాతం పెరిగి రూ. 193 కోట్లకు చేరింది. 2013-14 సంవత్సరం లాభదాయకంగా సాగిందని, క్రితం సంవత్సరంతో పోలిస్తే నికర లాభం 31 శాతం మేర పెరిగిందని ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ చైర్మన్ సంజీవ్ గోయెంకా తెలిపారు.ఫిలిప్పీన్స్‌లో కొత్తగా రెండో డెలివరీ సెంటర్‌ని ఏర్పాటు చేశామని, దీంతో మొత్తం మీద 46 సెంటర్స్ ఉన్నట్లవుతుందని ఆయన వివరించారు. కంపెనీ ఆదాయాల్లో టెలికం అండ్ మీడియా వాటా 43 శాతంగా, హెల్త్‌కేర్ 34 శాతంగా, బీఎఫ్ఎస్ఐ వాటా 22 శాతంగా ఉంది. -
ధోని మమ్మల్ని లెక్క చేయలేదు!
⇒ అందుకే కెప్టెన్సీ నుంచి తప్పించాం ⇒ పుణే యజమాని గోయెంకా సంచలన వ్యాఖ్యలు పుణే: ఒక్క సీజన్లో జట్టు ప్రదర్శన బాగా లేకపోయినంత మాత్రాన ధోనిలాంటి దిగ్గజ కెప్టెన్‌ను ఎవరైనా తప్పిస్తారా! పుణే జట్టు అతడిని నాయకత్వ బాధ్యతల నుంచి తొలగించిన దగ్గరి నుంచి అభిమానుల మదిలో ఇదే ప్రశ్న. మార్పు కోసమే అంటూ స్మిత్‌ను ఎంపిక చేయడంకంటే దీని వెనక మరో బలమైన కారణం ఉండవచ్చని అందరిలో సందేహాలు తలెత్తాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా అనేక విషయాలు వెల్లడించారు. ధోని గురించి ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జట్టు యజమానులైన తమను ధోని పట్టించుకోకపోవడమే ప్రధాన కారణమని అర్థమవుతోంది. ఒక బెంగాలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ్యలో గోయెంకా మాట్లాడుతూ... ‘ధోని మాకు ఫోన్లో కూడా ఎప్పుడూ అందుబాటులోకి రాలేదు. ఫ్రాంచైజీ కీలక సమావేశాలకు కూడా అతను రాలేదు. అతనితో మాట్లాడాలనుకున్న ప్రతీసారి ఏజెంట్ అరుణ్ పాండే ద్వారానే వెళ్లాల్సి వచ్చేది. గత ఏడాది లీగ్ సమయంలో అతను టీమ్ మీటింగ్‌లకు కూడా దూరంగా ఉన్నాడు. ఇందులో చర్చించిన ఫీల్డింగ్‌ను ధోని మ్యాచ్‌లో పూర్తిగా మార్చేశాడు. అతను ఆ సమావేశంలో లేకపోవడం వల్ల ఏం జరిగిందో కూడా ధోనీకి తెలీదని ఒక సీనియర్ ఆటగాడు మాకు చెప్పాడు’ అని గోయెంకా కుండబద్దలు కొట్టారు. జట్టు నెట్ ప్రాక్టీస్‌లకు కూడా మహి హాజరు కాలేదని, లెగ్‌స్పిన్నర్ ఆడమ్ జంపాను తుది జట్టులోకి తీసుకోమంటే తాను అతని ఆటను ఎప్పుడూ చూడలేదని చెప్పడం తమకు ఆశ్చర్యం కలిగించిందని పుణే యాజమాన్యం పేర్కొంది. దేశవాళీలో మంచి ప్రదర్శన లేకపోయినా ఫ్రాంచైజీపై ఒత్తిడి తెచ్చి తన జార్ఖండ్ రాష్ట్రానికే చెందిన సౌరభ్ తివారిని బలవంతంగా జట్టులోకి తీసుకోవడంతో పాటు టీమ్ జెర్సీ రంగు, డిజైన్‌కు సంబంధించి ధోని ఇచ్చిన సూచనలను యాజమాన్యం పట్టించుకోలేదు. క్రికెటేతర అంశాల్లో కూడా అతను జోక్యం చేసుకొనేంత అధికారం ధోని చేతుల్లో ఇవ్వరాదని ఆర్పీజీ టీమ్ భావించింది. దాంతో మార్పు అనివార్యమంటూ జనవరిలోనే ధోనికి సమాచారం ఇవ్వగా, ‘మీరు ఏది సరైందని అనిపిస్తే అది చేయండి. ఇది మీ నిర్ణయం. నేను ఆటగాడిగానే ఉంటాను’ అని ధోని అప్పుడే చెప్పినట్లు తెలిసింది. ‘సామాన్య అభిమానులకు ఈ నిర్ణయం నచ్చదని మాకు తెలుసు. అయితే ఇదే సరైంది. నేను నిజాలను ఎప్పుడైనా మొహం మీదే చెప్పేస్తాను. ఫ్రాంచైజీ మేలు కోసమే ధోనిని తప్పించాం’ అని గోయెంకా స్పష్టం చేశారు. జార్ఖండ్ కెప్టెన్‌గా తొలిసారి...: ఐపీఎల్లో కెప్టెన్సీకి దూరమైన రెండు రోజులకే ధోని తన సొంత రాష్ట్రానికి నాయకుడిగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడు. ఈనెల 25 నుంచి జరిగే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ధోని జార్ఖండ్ కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ జట్టును మంగళవారం ప్రకటించారు. భారత్‌కు 331 అంతర్జాతీయ మ్యాచ్‌లలో, 143 ఐపీఎల్లో మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని జార్ఖండ్‌కు తొలిసారి కెప్టెన్ కావడం విశేషం. గత ఏడాది కూడా ఈ టోర్నీ ఆడిన ధోని... వరుణ్ ఆరోన్ కెప్టెన్సీలో ఆడాడు. గతేడాది టీమ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో గోయెంకా, ధోని (ఫైల్)