DC vs LSG
-
LSG VS DC: ఆ కారణం చెప్పి ఓటమిని కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదు: పంత్
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 22) రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ, ఎల్ఎస్జీ తలపడ్డాయి. లక్నో హోం గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. మార్క్రమ్ (52), మిచెల్ మార్ష్ (45) తొలి వికెట్‌కు 10 ఓవర్లలో 87 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చినా ఆ ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు సరిగ్గా ఆడకపోవడంతో లక్నో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. ఆఖర్లో ఆయుశ్ బదోని (21 బంతుల్లో 36) బ్యాట్ ఝులిపించడంతో లక్నో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇన్నింగ్స్ ముగిసే సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ రెండు బంతులు ఆడి డకౌటయ్యాడు. మార్క్రమ్ ఔటయ్యాక మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సిన పంత్ ఆఖరి ఓవర్లో బ్యాటింగ్‌కు రావడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ గెలుపుతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతూ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఆటగాడిగానే కాకుండా, కెప్టెన్‌గా కూడా విఫలమైన పంత్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ సీజన్లో లక్నోకు ఢిల్లీ చేతిలో ఇది రెండో ఓటమి. వైజాగ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఢిల్లీ లక్నోను చిత్తు చేసింది.నిన్నటి మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ చాలా బాధగా కనిపించాడు. ప్రజెంటేషన్ సందర్భంగా మాట్లాడుతూ ఇలా అన్నాడు. మేము 20 పరుగులు తక్కువ చేశామని తెలుసు. ఈ మైదానంలో టాస్ చాలా కీలకపాత్ర పోషిస్తుంది. తొలుత బౌలింగ్ చేసే జట్టుకు వికెట్ నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఛేజింగ్ సమయంలో పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా మారుతుంది. ఈ పిచ్‌పై ఇది ఎప్పుడూ జరిగేదే. దీన్ని సాకుగా చూసి ఓటమిని కప్పిపుచ్చుకోవాలనుకోవడం లేదు.బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కు వెళ్లడంపై స్పందిస్తూ.. వికెట్ తీరును సద్వినియోగం చేసుకుంటాడని సమద్‌ను ముందుగా పంపాము. మిల్లర్‌ను సైతం అదే ఉద్దేశంతో నా కంటే ముందు బరిలోకి దించాము. వికెట్ తీరు ముందు ఇవేవి వర్కౌట్ కాలేదు. తదుపరి మ్యాచ్‌లపై స్పందిస్తూ.. ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచనలు లేవు. బృంద సభ్యులందరం కలిసి కూర్చుంటాము. అప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్‌పై డిస్కస్ చేస్తాము. ఈ ఓటమిని ఇక్కడే మరచిపోయే ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తాము. ఈ మ్యాచ్‌లో ఓడినా లక్నో పాయింట్ల పట్టికలో మరో స్థానం కిందికి దిగజారలేదు. అయితే రన్‌రేట్ మాత్రం మైనస్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు -0-054 రన్‌రేట్‌తో ఐదో స్థానంలో (10 పాయింట్లు) కొనసాగుతుంది. గుజరాత్, ఢిల్లీ చెరి 12 పాయింట్లతో టాప్-2లో ఉండగా.. ఆర్సీబీ, పంజాబ్ తలో 10 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. -
LSG VS DC: పంత్‌పై మండిపడుతున్న అభిమానులు.. గొయెంకాకు సరైన శాస్తి జరిగింది..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ చెత్త ప్రదర్శన కొనసాగుతుంది. నిన్న (ఏప్రిల్ 22) ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇన్నింగ్స్ ముగిసే సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రెండు బంతులు ఆడి డకౌటయ్యాడు. ఈ సీజన్లో పంత్‌కు ఇది రెండో డకౌట్.ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో పంత్ కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 106 పరుగులు మాత్రమే చేశాడు. పంత్ చెత్త ఆటతీరు, కెప్టెన్‌గా తీసుకున్న చెత్త నిర్ణయాలు నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో కొంపముంచాయి. ఓపెనర్లు మార్క్రమ్, మార్ష్ మంచి ఆరంభం ఇచ్చినా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో లక్నో స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. అనంతరం ఛేదనలో రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్ అద్బుతంగా ఆడి ఢిల్లీని గెలిపించారు.వరుస వైఫల్యాల నేపథ్యంలో పంత్ భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా రాహుల్ లాంటి ఆణిముత్యాన్ని వదులుకుని పంత్ లాంటి చెత్తను రూ. 27 కోట్లకు కొనుక్కున్నాడని కామెంట్లు చేస్తున్నారు. రాహుల్‌ను కాదనుకుని ఎంతో నమ్మకంతో కెప్టెన్సీ కూడా కట్టబెడితే ఇదేనా వెలగబెట్టేదని మండిపడుతున్నారు. పంత్‌కు 27 లక్షలు కూడా దండగే అని అంటున్నారు. ఈ దెబ్బతో పంత్ పని అయిపోయిందని చర్చించుకుంటున్నారు.కాగా, నిన్నటి మ్యాచ్‌లో పంత్ ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గా కూడా ఘోరంగా విఫలమయ్యాడు. మార్క్రమ్ ఔటైన తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రాకుండా పెద్ద తప్పిదమే చేశాడు. మూడో స్థానంలో కాకపోయినా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా లక్నో ఓ మోస్తరుకు మించి భారీ స్కోరే చేసేది. బ్యాటింగ్‌లో విఫలం కావడంతో పంత్ ఫీల్డింగ్ సమయంలో చాలా చిరాకుగా ఉన్నాడు. సహచరులపై అరుస్తూ కనిపించాడు. బౌలర్లను సరిగ్గా రొటేట్ చేయలేకపోయాడు. ఫలితంగా రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్ రెచ్చిపోయారు.రాహుల్ గత సీజన్లో లక్నో యజమాని సంజీవ్ గొయెంకా చేతిలో ఎదురైన అవమానానికి నిన్నటి మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకున్నాడు. రాహుల్ గొయెంకాకు బ్యాట్‌తో బుద్ది చెప్పడమే కాకుండా మ్యాచ్ ముగిసిన తర్వాత అసలు రివెంజ్ తీర్చుకున్నాడు. గొయెంకా కరచాలనం చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేయగా రాహుల్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. ఆ సమయంలో గొయెంకా పైకి నవ్వుతూ కనిపించినప్పటికీ. లోలోపల రాహుల్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌కు బెంబేలెత్తిపోయుంటాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్ (45), ఆయుశ్ బదోని (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. -
LSG VS DC: ఇది కదా ప్రతీకారమంటే.. లక్నో ఓనర్‌కు ఇచ్చి పడేసిన రాహుల్
గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గొయెంకా తన పట్ల వ్యవహరించిన తీరుకు నాటి లక్నో కెప్టెన్, ప్రస్తుత ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ తనదైన శైలిలో బదులిచ్చాడు. నిన్న (ఏప్రిల్ 22) ఎల్ఎస్జీపై విజయానంతరం గొయెంకా కరచాలనం చేస్తూ తనతో మాట్లాడే ప్రయత్నం చేయగా.. రాహుల్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు. రాహుల్ చర్యకు గొయెంకా సహా మైదానంలో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇదేంటబ్బా రాహుల్ ఇలా ప్రవర్తించాడని అనుకున్నారు.THE COMEBACK MAN - KL RAHUL. 🦁 pic.twitter.com/EQ67LvjLVl— Mufaddal Vohra (@mufaddal_vohra) April 22, 2025అయితే దీని వెనుక పెద్ద స్టోరీనే ఉంది. గత సీజన్లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమి అనంతరం గొయెంకా రాహుల్‌ను బహిరంగంగా అవమానించాడు. అందరి ముందు నిలదీశాడు. గొయెంకా చర్యకు మనసు నొచ్చుకున్న రాహుల్ లక్నోను వీడి ఢిల్లీ పంచన చేరాడు. ఇప్పుడు అవకాశం రావడంతో లక్నో ఓనర్‌కు తన ఆటతీరుతోనే బుద్ది చెప్పాడు. తనను ఘోరంగా అవమానించిన గొయెంకాపై వారి సొంత మైదానంలోనే ప్రతీకారం తీర్చుకున్నాడు. Sanjeev Goenka tried to stop KL Rahul, but Rahul rejected any interaction. pic.twitter.com/1aQ68CIcic— Himanshu Pareek (@Sports_Himanshu) April 22, 2025నిన్న (ఏప్రిల్ 22) ఎల్ఎస్జీతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి ఢిల్లీని గెలిపించాడు. సిక్సర్‌తో మ్యాచ్ ముగించి గొయెంకాకు తానేమి చేయగలనో నిరూపించాడు. ఈ సీజన్లో లక్నోపై ఢిల్లీకి ఇది రెండో విజయం. వైజాగ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కూడా ఢిల్లీ లక్నోను చిత్తు చేసింది. అయితే తన భార్య బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండటంతో రాహుల్ ఆ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. సీజన్ ప్రారంభం నుంచే గొయెంకాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూసిన రాహుల్.. నిన్న అవకాశం రావడంతో తన దెబ్బను రుచి చూపించాడు. ఈ సీజన్లో రాహుల్ మాంచి కసితో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 323 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు. నిన్నటి మ్యాచ్‌లో రాహుల్ ఓ భారీ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.ఎల్ఎస్జీలో రాహుల్ ప్రస్తానంలక్నో ఐపీఎల్ అరంగేట్రం నుంచి కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్.. తొలి రెండు సీజన్లలో (2022, 2023) ఆ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. అయితే గత సీజన్లో రాహుల్ లక్నోను ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు. గత సీజన్లో నెమ్మదిగా ఆడుతున్నాడని కూడా రాహుల్‌పై విమర్శలు వచ్చాయి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. ఢిల్లీ పేసర్ ముకేశ్ కుమార్ (4-0-33-4) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (52) అర్ద సెంచరీతో రాణించగా.. మిచెల్ మార్ష్ (45), ఆయుశ్ బదోని (36) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. రాహుల్ (57 నాటౌట్), అభిషేక్ పోరెల్ (51), అక్షర్ పటేల్ (34 నాటౌట్) సత్తా చాటడంతో 17.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. -
LSG VS DC: భారీ రికార్డులపై కన్నేసిన రాహుల్, కుల్దీప్
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 22) ఓ రసవత్తర మ్యాచ్ జరుగనుంది. టేబుల్ సెకెండ్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఐదో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లక్నో సొంత మైదానమైన అటల్ బిహారి వాజ్‌పేయ్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.ఈ మ్యాచ్‌కు ముందు ఢిల్లీ స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ రెండు భారీ రికార్డులపై కన్నేశారు. ఈ మ్యాచ్‌లో రాహుల్ 51 పరుగులు చేస్తే ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని తాకిన ఎనిమిదో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం రాహుల్ ఖాతాలో 4949 పరుగులు (138 మ్యాచ్‌లు) ఉన్నాయి. ఇందులో 4 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.రాహుల్‌కు ముందు విరాట్ కోహ్లి (8326), రోహిత్ శర్మ (6786), శిఖర్ ధవన్ (6769), డేవిడ్ వార్నర్ (6565), సురేశ్ రైనా (5528), ధోని (5377), ఏబీ డివిలియర్స్ (5162) ఐపీఎల్లో 5000 పరుగుల మైలురాయిని తాకారు.కుల్దీప్ విషయానికొస్తే.. ఈ లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బౌలర్ లక్నోతో నేడు జరుగబోయే మ్యాచ్‌లో ఓ వికెట్ తీస్తే.. ఐపీఎల్లో 100 వికెట్ల మైలురాయిని చేరకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన 27వ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ ఇప్పటివరకు 214 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో చహల్ మినహా మరే బౌలర్ 200 వికెట్ల మార్కును తాకలేదు. టాప్-5లో పియూశ్ చావ్లా (192), భువనేశ్వర్ కుమార్ (189), సునీల్ నరైన్(187), రవిచంద్రన్ అశ్విన్ (185) ఉన్నారు.ప్రస్తుత సీజన్లో రాహుల్, కుల్దీప్ల ఫామ్‌ను చూస్తే నేడు లక్నోతో జరుగబోయే మ్యాచ్‌లో ఈ రికార్డులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో రాహుల్ 6 మ్యాచ్‌ల్లో 266 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో 11 స్థానంలో ఉండగా.. 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసిన కుల్దీప్ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.లక్నోపై సంచలన విజయం సాధించిన ఢిల్లీఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్‌లో లక్నోను ఢిల్లీ చివరి నిమిషంలో ఓడించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో అశుతోష్ శర్మ (66 నాటౌట్), విప్రాజ్ నిగమ్ (39) వీరోచితమైన ప్రదర్శన కనబర్చి (లక్నో నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో) ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీని గెలిపించాడు. చివరి 7 ఓవర్లలో 94 పరుగులు చేయాల్సిన తరుణంలో (6 వికెట్లు కోల్పోయాక) ఈ జోడీ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి లక్నో చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. అశుతోష్ చివరి నిమిషం వరకు క్రీజ్‌లో ఉండి ఢిల్లీని గెలిపించాడు.ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగిన నేపథ్యంలో నేటి మ్యాచ్‌పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరే క్రమంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. నేటి మ్యాచ్‌తో లక్నో ఎక్స్‌ప్రెస్ మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో లక్నో రాజస్థాన్ రాయల్స్‌ను ఊహించని విధంగా చివరి ఓవర్లో మట్టికరిపించి మాంచి ఊపు మీద ఉంది. ఢిల్లీ గత మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో భంగపడి కాస్త ఢీలాగా కనిపిస్తుంది.నేటి మ్యాచ్‌ను తుది జట్లు (అంచనా)లక్నో: ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (c & wk), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ / మయాంక్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రాఠి, అవేష్ ఖాన్, ఆయుష్ బడోనిఢిల్లీ: అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, KL రాహుల్ (wk), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (c), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ/దుష్మంత చమీరా, ముఖేష్ కుమార్, డోనోవన్ ఫెరీరా -
పంత్ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే.. లక్నో మూల్యం చెల్లించింది!
పొట్టి ఫార్మాట్ క్రికెట్లో మ్యాచ్‌ల ఫలితం ఎప్పుడూ అనూహ్యంగా ఉంటుంది. ఢిల్లీ కేపిటల్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య సోమవారం విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్ ఈ విషయాన్ని మరో మారు స్పష్టమైంది.సత్తా చాటిన శార్దూల్ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో భాగంగా.. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి అదే ధోరణిలో జరిగింది. భారత్ జట్టులో స్థానం కోల్పోయి, వేలంలో అమ్ముడుపోక దిక్కుతోచని స్థితిలో ఉన్న అల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్... మీడియం పేసర్ మొహ్సిన్ ఖాన్ గాయం కారణంగా తప్పుకోవడంతో జట్టులోకి వచ్చి.. సత్తా చాటడం ఒక ఎత్తు.ఇక ఇంగ్లండ్ కౌంటీ లో ఎసెక్స్ జట్టు తరపున ఆడాలని నిర్ణయించుకుని ఫ్లయిట్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్న అతడు.. అనూహ్యంగా దక్కిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. మొదటి ఓవర్లో ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ మరియు అభిషేక్ పోరెల్ ల వికెట్లు పడగొట్టాడు.దిక్కుతోచని స్థితిమరో వైపు ఎడమచేతి వాటం స్పిన్నర్ ఎం సిద్ధార్థ్ కు సమీర్ రిజ్వి ని అవుట్ చేయడంతో ఢిల్లీ రెండో ఓవర్ లోనే 7 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. 209 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ ఒక దశలో 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితికి చేరింది. ఈ దశలో ఉత్తర్ ప్రదేశ్ అల్ రౌండర్ విప్రజ్ నిగమ్ 15 బంతుల్లో 39 పరుగులు చేసి ఢిల్లీకి కొంత ఉపశమనాన్నిచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ కి వచ్చిన ఢిల్లీ బ్యాట్స్‌మన్ అశుతోష్ శర్మ తాను ఎదుర్కొన్న తొలి 20 బంతుల్లో కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు.ఇక ఢిల్లీకి లక్ష్య సాధన దాదాపు కష్టమన్న దశలో అశుతోష్ శర్మ పూనకం వచ్చిన రీతిలో బ్యాటింగ్ చేసి తదుపరి 11 బంతుల్లో 46 పరుగులు సాధించాడు. అందులో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. దీనితో ఓటమి చేరువులో ఉన్న ఢిల్లీ కి ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే ఒక వికెట్ తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు.లక్నోను ఆదుకున్న మార్ష్, పూరన్గత సీజన్ లో తరచుగా పవర్ ప్లేలో వెనుకబడి ఉన్నట్లు కనిపించిన లక్నో ఈ సీజన్ లో దానిని సరిదిద్దే ప్రయత్నం చేసింది. జట్టులోని ఇద్దరు విదేశీ ఆటగాళ్ల కు ఆ బాధ్యతను అప్పగించింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ రెండవ వికెట్‌కు కేవలం 42 బంతుల్లో 87 పరుగులు జోడించారు. పూరన్ 30 బంతుల్లో ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లు లతో 75 పరుగులు చేయగా, మార్ష్ 36 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల తో 72 పరుగులు సాధించాడు. ఫలితంగా లక్నో జట్టు 250 పరుగులు పైగా సాధిస్తుందని భావిస్తున్న తరుణంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మరియు భారత్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వరుసగా వికెట్లు తీసి లక్నోని దెబ్బతీశారు. లక్నో 14 నుంచి 19 ఓవర్లలో కేవలం 33 పరుగులు మాత్రమే జోడించి ఆరు వికెట్లు కోల్పోయింది.ఈ దశలో లక్నో 200 పరుగులు దాటడమే కష్టమని భావిస్తున్న తరుణంలో డేవిడ్ మిల్లర్ ఇన్నింగ్స్ చివరి రెండు బంతుల్లో మీడియం పేసర్ మోహిత్ శర్మ రెండు సిక్సర్లు కొట్టడంతో స్కోరు 209కి చేరింది. నిజానికి ఢిల్లీ స్కోరు 204/9 వద్ద ఉన్న సమయంలో మోహిత్ శర్మను స్టంపౌట్ చేసే అవకాశాన్ని పంత్ మిస్ చేశాడు. ఆఖరి ఓవర్ మొదటి బంతికి షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో బాల్ మోహిత్ ప్యాడ్లను తాకినట్లుగా అనిపించింది.పంత్ చేసిన ఆ ఒక్క తప్పు వల్లేఅయితే, అంతలోనే అతడు పరుగు కోసం క్రీజును వీడగా కీపర్ పంత్ స్టంపింగ్ చేయకుండా.. రివ్యూకు వెళ్లాడు. ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేశాడు. అయితే, రీప్లేలో బంతి స్టంప్స్‌ను మిస్ అవుతోందని థర్డ్ అంపైర్ నుంచి నిర్ణయం వెలువడగా.. సేఫ్ అయ్యాడు మోహిత్. నిజానికి అతడిని స్టంపౌట్ చేస్తే.. పదో వికెట్ కోల్పోయి అప్పుడే ఢిల్లీ కథ ముగిసేది. అదే ఓవర్లో మూడో బంతికి అశుతోష్ సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించాడు. అలా నాటకీయ పరిణామాలతో ఢిల్లీ ఈ మ్యాచ్ లో విజయం సాధించడం విశేషం. Never gave up hope 💪Never stopped believing 👊A special knock and match to remember for the ages 🥳#DC fans, how's the mood? 😉Scorecard ▶ https://t.co/aHUCFODDQL#TATAIPL | #DCvLSG | @DelhiCapitals pic.twitter.com/HYeLTrEjTn— IndianPremierLeague (@IPL) March 24, 2025pic.twitter.com/JBNXCNw3Ql— The Game Changer (@TheGame_26) March 25, 2025 చదవండి: ‘గిల్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యం’ -
చరిత్ర సృష్టించిన అశుతోష్.. ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్‌గా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపుతో ఆరంభించింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం సాధించింది. ఇందుకు ప్రధానం కారణం ఢిల్లీ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు.సుడిగాలి ఇన్నింగ్స్ముఖ్యంగా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అశుతోష్ శర్మ (Ashutosh Sharma) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. చేజారిందనుకున్న మ్యాచ్ ఢిల్లీ సొంతమైంది. 26 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. కేవలం 31 బంతుల్లోనే 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అశుతోష్ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.ఇక లక్నోతో మ్యాచ్ సందర్భంగా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో.. విజయంతమైన లక్ష్య ఛేదనలో ఏడు లేదంటే ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి.. అత్యధిక స్కోరు సాధించిన భారత తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో యూసఫ్ పఠాన్ రికార్డును అశుతోష్ బద్దలు కొట్టాడు.సెంచూరియన్ వేదికగా 2009లో యూసఫ్ పఠాన్ రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగి.. ఢిల్లీపై 62 పరుగులు సాధించి నాడు తన జట్టును గెలిపించుకున్నాడు. ఇక ఈ జాబితాలో ఓవరాల్‌గా డ్వేన్ బ్రావో 68 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు.ఏడు లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి లక్ష్య ఛేదనలో జట్టును గెలిపించిన బ్యాటర్లు👉డ్వేన్ బ్రావో- 2018లో ముంబై వేదికగాచెన్నై సూపర్ కింగ్స్ తరఫున ముంబై ఇండియన్స్‌పై 68 పరుగులు👉అశుతోష్ శర్మ- 2025లో విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున లక్నో సూపర్ జెయింట్స్‌పై 66 నాటౌట్👉ఆండ్రీ రసెల్- 2015లో పుణె వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున పంజాబ్ కింగ్స్‌పై 66 పరుగులు👉యూసఫ్ పఠాన్- 2009లొ సెంచూరియన్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ తరఫున ఢిల్లీపై 62 పరుగులు👉ప్యాట్ కమిన్స్- 2022లో పుణె వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ముంబై ఇండియన్స్‌పై 56 పరుగులుమొదటి జట్టుగా ఢిల్లీ అరుదైన రికార్డుమరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా సరికొత్త రికార్డు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టు తరఫున ఏడు, ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు వందకు పైగా పరుగులు సాధించి.. జట్టును గెలిపించడం ఇదే తొలిసారి. అంతకు ముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉండేది. 2018లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా చెన్నై లోయర్ ఆర్డర్ బ్యాటర్లు 79 పరుగులు చేసి జట్టును గెలిపించారు.ఏడు లేదా ఆ తర్వాతి స్థానాల్లోని బ్యాటర్లు లక్ష్య ఛేదనలో అత్యధిక పరుగులతో జట్టును గెలిపించిన సందర్భాలు👉2025- ఢిల్లీ క్యాపిటల్స్- లక్నో సూపర్ జెయింట్స్‌పై 113 రన్స్👉2018- చెన్నై సూపర్ కింగ్స్- ముంబై ఇండియన్స్‌పై 79 పరుగులు.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ లక్నో👉వేదిక: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం👉టాస్: ఢిల్లీ క్యాపిటల్స్.. తొలుత బౌలింగ్👉లక్నో స్కోరు: 209/8 (20)👉ఢిల్లీ స్కోరు: 211/9 (19.3)👉ఫలితం: ఒక వికెట్ తేడాతో లక్నోపై ఢిల్లీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అశుతోష్ శర్మ. చదవండి: అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోనిClose finish ✅Safe to say, the #DC dugout was a bunch of emotions in those last couple of overs of a nail-biter! 😦 ☺𝗥𝗮𝘄 𝗩𝗶𝘀𝘂𝗮𝗹𝘀! 🎥 🔽 #TATAIPL | #DCvLSG | @DelhiCapitals pic.twitter.com/0EIdIQ7VTt— IndianPremierLeague (@IPL) March 25, 2025 -
DC Vs LSG: ఈ అశుతోష్ మామూలోడు కాదు.. గత సీజన్లోనూ ఇంతే.. కానీ..!
ఐపీఎల్ 2025 సీజన్లో నిన్న (మార్చి 24) అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. విశాఖ వేదికగా ఢిల్లీ, లక్నో హోరాహోరీగా తలపడ్డాయి. అంతిమంగా ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. మిచెల్ మార్ష్ (36 బంతుల్లో 72; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), నికోలస్ పూరన్ (30 బంతుల్లో 75; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.అనంతరం ఛేదనలో ఆదిలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఆశుతోష్ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) హీరోయిక్ ఇన్నింగ్స్ ఆడటంతో సంచలన విజయం సాధించింది. 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తున్న ఢిల్లీని అశుతోష్.. అరంగేట్రం ఆటగాడు విప్రాజ్ నిగమ్ (15 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) సాయంతో గెలిపించాడు. అశుతోష్ నమ్మశక్యంకాని రీతిలో షాట్లు ఆడి ఢిల్లీకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.అశుతోష్ లోయర్ మిడిలార్డర్లో వచ్చి ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడటం ఇది మొదటిసారి కాదు. గత సీజన్లో అతను పంజాబ్ కింగ్స్ తరఫున ఇలాంటి ఇన్నింగ్స్‌లు చాలా ఆడాడు. అయితే గత సీజన్లో అశుతోష్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా తన జట్టును గెలిపించలేకపోయాడు. తద్వారా అతనికి గుర్తింపు దక్కలేదు. ఈ సీజన్లో సీన్ మారింది. ఢిల్లీ తరఫున తొలి మ్యాచ్‌లోనే అశుతోష్ తన సహజ శైలిలో రెచ్చిపోయాడు. గత సీజన్ వీకనెస్ను (చివరి దాకా క్రీజ్‌లో నిలబడటం) అధిగమించి చివరి దాకా క్రీజ్‌లో నిలబడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. మ్యాచ్ అనంతరం అశుతోష్ ఓ విషయాన్ని ప్రస్తావించాడు. తన మెంటార్ శిఖర్ ధవన్ సలహాలతో గత సీజన్ లోపాలను అధిగమించానని చెప్పుకొచ్చాడు. ఇందు కోసం చాలా కష్ట పడ్డానని తెలిపాడు.అశుతోష్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అనంతరం అభిమానులు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ అశుతోష్ మామూలోడు కాదంటూ కితాబునిస్తున్నారు. 26 ఏళ్ల అశుతోష్ మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో జన్మించాడు. అశుతోష్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ (రైట్ ఆర్మ్ మీడియం పేసర్) కూడా చేయగలడు.దేశవాలీ టీ20ల్లో అశుతోష్‌కు ఓ అద్భుతమైన రికార్డు ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో అతను 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. టీ20ల్లో భారత్ తరఫున ఇదే ఫాసెస్ట్ హాఫ్ సెంచరీ.అశుతోష్లోని హార్డ్ హిట్టింగ్ టాలెంట్ చూసి 2024 వేలంలో పంజాబ్ అతన్ని 20 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే పంజాబ్ అశుతోష్‌ను ఈ ఏడాది మెగా వేలానికి ముందు వదిలేసింది. అశుతోష్ గురించి ముందే తెలిసిన శిఖర్ ధవన్ అతన్ని ఢిల్లీ యాజమాన్యానికి సిఫార్సు చేశాడు. ఢిల్లీ అతన్ని మెగా వేలంలో రూ. 3.8 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. గత సీజన్లో అశుతోష్ ఆడిన కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు..గుజరాత్‌పై 17 బంతుల్లో 31సన్‌రైజర్స్‌పై 15 బంతుల్లో 33 నాటౌట్రాజస్థాన్పై 16 బంతుల్లో 31ముంబై ఇండియన్స్‌పై 28 బంతుల్లో 61 -
విశాఖలో ఐపీఎల్ మ్యాచ్.. అభిమానుల సందడే సందడి (ఫొటోలు)
-
DC vs LSG: విశాఖలో మ్యాచ్.. తుదిజట్లు ఇవే!.. వర్షం ముప్పు?
ఐపీఎల్-2025 (IPL)లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)- లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మధ్య సోమవారం పోటీ జరుగనుంది. విశాఖపట్నంలోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ఇందుకు వేదిక. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది రెండో హోంగ్రౌండ్ అన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఢిల్లీకి గతేడాది సారథ్యం వహించిన టీమిండియా స్టార్ రిషభ్ పంత్.. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్ అయ్యాడు. రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో ఫ్రాంఛైజీ కొనుక్కోగా.. ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లోనే తన పాత జట్టుపై ఈ వికెట్ కీపర్ ప్రతాపం చూపేందుకు సిద్ధమయ్యాడు.పంత్ వర్సెస్ అక్షర్!మరోవైపు.. పంత్ నిష్క్రమణతో ఖాళీ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ పోస్టును టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ భర్తీ చేశాడు. ఈ జట్టులో మరో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ కూడా కీలకం కానున్నాడు. అయితే, లక్నోతో మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహుల్ భార్య అతియా శెట్టి త్వరలోనే తమ తొలి సంతానానికి జన్మనివ్వనుండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది.గాయాల బెడదఇదిలా ఉంటే.. లక్నో జట్టును గాయాల బెడద వేధిస్తోంది. ఆ జట్టు పేసర్ మొహ్సిన్ ఖాన్ సీజన్ మొత్తానికి దూరం కాగా.. అతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్లుఓకి వచ్చాడు. అయితే, కీలక పేసర్లు మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్ కూడా గాయాల బారిన పడ్డారు. వీరంతా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.ఇలా స్టార్ పేసర్లంతా గాయపడటం లక్నో తుదిజట్టు కూర్పుపై కచ్చితంగా ప్రభావం చూపనుంది. మరోవైపు.. ఢిల్లీ రాహుల్ సేవలను కోల్పోయినా జేక్ ఫ్రేజర్-మెగర్క్‌తో పాటు ఫాఫ్ డుప్లెసిస్ అందుబాటులో ఉండటం.. ఆ జట్టుకు సానుకూలాంశంగా పరిణమించింది. అంతేకాదు ప్రపంచస్థాయి పేసర్ మిచెల్ స్టార్క్ కూడా జట్టుతో ఉండటం ఢిల్లీకి కలిసి రానుంది.లక్నోదే పైచేయిఇక లక్నో మిచెల్ మార్ష్‌తో అర్షిన్ కులకర్ణిని ఇన్నింగ్స్ ఆరంభించేందుకు పంపే సూచనలు ఉన్నాయి. పంత్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు నాయకుడిగానూ జట్టును ముందుండి నడిపించనుండగా.. నికోలస్ పూరన్ స్పెషలిస్టు బ్యాటర్‌గా అందుబాటులో ఉన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆకాశ్ సింగ్ లేదంటే షాబాజ్ అహ్మద్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. కాగా ఢిల్లీ- లక్నో జట్లు ఇప్పటి వరకు ముఖాముఖి ఐదుసార్లు తలపడగా.. ఢిల్లీ రెండుసార్లు, లక్నో మూడుసార్లు గెలిచాయి.వర్షం ముప్పు?ఇదిలా ఉంటే.. విశాఖపట్నంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములతో ఆకాశం మేఘావృతమైంది. ఇక హైదరాబాద్‌లో ఇప్పటికే కుండపోత వర్షం కురుస్తుండగా.. విశాఖలోనూ వాన పడితే ఢిల్లీ- లక్నో మ్యాచ్‌పై ప్రభావం పడనుంది.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ లక్నో తుదిజట్లు (అంచనా)ఢిల్లీజేక్ ఫ్రేజర్-మెగర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముకేష్ కుమార్, టి.నటరాజన్ఇంపాక్ట్ ప్లేయర్: మోహిత్ శర్మలక్నోఅర్షిణ్ కులకర్ణి, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుశ్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, రాజ్వర్ధన్ హంగ్రేకర్, రవి బిష్ణోయి, షమార్ జోసెఫ్ఇంపాక్ట్ ప్లేయర్: ఆకాశ్ సింగ్/షాబాజ్ అహ్మద్.చదవండి: కలకాలం గుర్తుండిపోతుంది!.. ఎవరీ విఘ్నేశ్?.. ధోని కూడా ఫిదా!Captains 👍Match-day rivals 🆚Friends through & through 🤝𝗠. 𝗢. 𝗢. 𝗗 Axar & Rishabh as we gear up for tonight's #DCvLSG clash 👌👌#TATAIPL | @DelhiCapitals | @LucknowIPL | @akshar2026 | @RishabhPant17 pic.twitter.com/mI2RI3WHYF— IndianPremierLeague (@IPL) March 24, 2025