Elections 2014
-
TS Election 2023: తొమ్మిది మంది 'సిట్టింగ్'లకు మళ్లీ చాన్స్!
వరంగల్: బీఆర్ఎస్లో టికెట్ల ఉత్కంఠకు తెరపడింది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేయడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఊహాగానాలకు తెరదించేలా ముఖ్యమంత్రి మరోసారి ‘సిట్టింగ్’లకే పెద్దపీట వేశారు. ఉమ్మడి వరంగల్‌లో 12 స్థానాలకు 11 స్థానాలకు సోమవారం అభ్యర్థులను ప్రకటించిన గులాబీ నేత.. జనగామ అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో పెట్టారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యకు మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ములుగు నియోజకవర్గం నుంచి జెడ్పీ ఇన్చార్జ్ చైర్పర్సన్ బడే నాగజ్యోతిని బరిలోకి దింపుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘సిట్టింగ్’లను మార్చుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఈసారి ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగుతారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారాన్ని పటాపంచలు చేసేలా కేసీఆర్ కేవలం ఒకే ఒక ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి మాత్రమే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఆశావహుల ఆశలన్నీ ఆవిరి కాగా.. తొమ్మిది మంది సిట్టింగ్‌లకు మళ్లీ పోటీ చేసే అవకాశం దక్కింది. మహబూబాబాద్, డోర్నకల్, భూపాలపల్లి, వరంగల్ తూర్పు నుంచి టికెట్ వస్తుందని భావించిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు మాలోతు కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య ప్రస్తావన లేకుండా పోయింది. మొదటిసారి నాగజ్యోతి.. ఎనిమిదోసారి రెడ్యానాయక్.. తాజాగా ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ప్రత్యేకతలు ఉన్నాయి. ములుగు నుంచి అభ్యర్థిగా ఎంపికై న బడే నాగజ్యోతి మొదటిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తుండగా.. మాజీ మంత్రి, డోర్నకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే ధరమ్సోతు రెడ్యానాయక్ ఎనిమిదోసారి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యానాయక్.. ఒక్కసారి మాత్రమే సత్యవతి రాథోడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇటీవల ఆయనపై కొంత వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో ఆయనకు బదులు కుటుంబంలో ఒకరికి లేదా మంత్రి సత్యవతికి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ రెడ్యానాయక్ ఇది నాకు చివరి ఎన్నిక.. భవిష్యత్‌లో పోటీ చేయనని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో మరోసారి ఎన్నికల బరిలో నిలిచే అవకాశం దక్కింది. ఓటమెరుగని నేతగా సుధీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒకసారి ఎంపీ, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడు సార్లు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా ఎన్నికై , మరో మూడుసార్లు (2009, 2014, 2018లలో) పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న దయాకర్‌రావు ఏడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఐదోసారి తలపడనున్నారు. 2014, 2018లలో వర్ధన్నపేట నుంచి గెలుపొందిన అరూరి రమేష్ హ్యాట్రిక్ దిశగా మూడోసారి బరిలో నిలవనున్నారు. అదే విధంగా పరకాల నుంచి ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి సైతం ఇదే రేసులో ఉన్నారు. మహబూబాబాద్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బానోతు శంకర్‌నాయక్ హ్యాట్రిక్ ఆశల్లో ఉన్నారు. ఉద్యమనేతగా ఎదిగిన పెద్ది సుదర్శన్‌రెడ్డి నర్సంపేట నుంచి రెండుసార్లు పోటీ చేసినప్పటికీ 2018లో గెలుపొందారు. మూడోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొంది బీఆర్ఎస్లో చేరిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కారు గుర్తుపై తొలిసారి పోటీ చేయనున్నారు. వరంగల్ తూర్పు నుంచి రెండోసారి నన్నపునేని నరేందర్ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. -
భంగపాటు తప్పదా !
భద్రాచలం, న్యూస్‌లైన్ : ఒక్కసారైనా భద్రాచలం పీఠాన్ని దక్కించుకోవాలనే టీడీపీ ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. ఆ పార్టీ అగ్రనాయకుల వ్యవహార శైలితో కేడర్‌లో పూర్తిగా నిరుత్సాహం ఏర్పడింది. దీంతో మండల స్థాయిలో ప్రచార బాధ్యతలు చేపట్టేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావటం లేదు. గ్రామాల్లో అయితే పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు కార్యకర్తలే కరువయ్యారు. ఆ పార్టీకి కొంత కేడర్ ఉన్నప్పటికీ డివిజన్ స్థాయిలో ఆధిపత్యం కోసం పార్టీ నాయకులు తరచూ కుమ్ములాడుకోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో భద్రాచలంలో నడిరోడ్డుపైనే నాయకులు ముష్టి యుద్ధాలకు దిగారు. పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్న తమలాంటి వారిని యశోద రాంబాబు చిన్నచూపు చూస్తున్నారంటూ ఇటీవల అర్ధరాత్రి వేళ ఆ పార్టీ కార్యాలయం ఎదుటే అతని అనుచరులు హల్చల్ చేశారు. వారం క్రితం భద్రాచలం మండలంలోని పలు గ్రామాల ముఖ్య కేడర్ అంతా యశోద రాంబాబు వ్యవహారశైలిపై పార్టీ అభ్యర్థి ఫణీశ్వరమ్మకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో మాట ఇచ్చిన తప్పిన ఆయన గ్రామాల్లోకి వస్తే ఓట్లు వేసేది లేద ంటూ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం పార్టీ కార్యాలయం ముందు హల్చల్ చేసిన నాయకులు ఏకంగా కార్యాలయానికి తాళాలు కూడా వేశారు. దీంతో ఆ పార్టీ కేడర్‌లో పూర్తిగా నిస్తేజం ఏర్పడింది. గత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ, సీపీఎం తర్వాత మూడో స్థానంలో నిలిచిన టీడీపీకి ప్రస్తుతం గ్రామాల్లో పూర్తిగా పట్టు తగ్గింది. వెంకటాపురం, చర్ల, భద్రాచలం, కూనవరం మండలాల్లో వర్గపోరు ఉంది. వ్యతిరేక వర్గాన్ని దెబ్బకొట్టేందుకు వేరే పార్టీకైనా ఓట్లు వేయించేందుకు సిద్ధమేనని అక్కడి నాయకులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని మండలాల్లో టీడీపీ ప్రచారంలో మిగతా పార్టీల కన్నా పూర్తిగా వెనుకబడిపోయింది. ఫణీశ్వరమ్మకు టికెట్టుపై తమ్ముళ్ల ఆగ్రహం : భద్రాచలం నియోజకవ ర్గంలోని పార్టీ కార్యకర్తలకు ఏనాడూ అందుబాటులో లేని ఫణీశ్వరమ్మకు అధిష్టానం టికెట్టు కట్టబెట్టడంపై స్థానిక నాయకుల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. టికెట్టు తమకే వస్తుందని ఆశతో ఎంతో కాలంగా పార్టీ అభివృద్ధి కోసమని పనిచేస్తున్న వాజేడుకు చెందిన బోదెబోయిన బుచ్చ య్య, చర్లకు చెందిన ఇర్పా శాంత, కూనవరానికి చెందిన సీనియర్ నాయకుడు సోడే రామయ్య భారీగానే ఆశలు పెట్టుకున్నారు. వీరంతా ఆయా మండలాల్లో మంచి పట్టుఉన్న నాయకులే. అయితే మూడు సార్లు ఎంపీగా గెలిచి, ఒక సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సీనియర్ నేత సోడె రామయ్యను ప్రచారం లో విస్మరించారు. హైదరాబాద్‌లోనే ఉంటూ పార్టీ అధినేతను ప్రసన్నం చే సుకున్న ఫణీశ్వమ్మ బరిలో నిలవటంతో ఆశావాహులంతా నిరుత్సాహంలో పడిపోయారు. బోదెబోయిన బుచ్చయ్య వంటి నాయకులు రెబల్‌గా పోటీ చేసేందుకు నామినేషన్ వేసినప్పటికీ, చివరకు మొత్తబడి విరమించుకున్నారు. అయితే ఫణీశ్వరమ్మకు పూర్తి స్థాయిలో సహకరించేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించటం లేదని పరిశీలకులు అంటున్నారు. అధిష్టానం మాట చెవికెక్కేనా : భద్రాద్రి తమ్ముళ్ల కుమ్ములాట తారాస్థాయికి చేరటంతో తెలంగాణ జిల్లాల పరిశీలకులు మండవ వెంకటేశ్వరరావు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రచారంలో తీవ్రంగా వెనుకబడిన ఇక్కడి నాయకత్వంపై తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి దిద్దుబాటు చేస్తున్న సమయంలోనే ఇరువురు నాయకులు వాదులాటకు దిగారు. ఇది చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునేంత వరకూ వెళ్లింది. దీంతో తేరుకున్న జిల్లా నాయకత్వం పార్టీని గాడిలో పెట్టేందుకు తోటకూర రవిశంకర్‌కు ప్రచార బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా యశోద రాంబాబుకు కూడా దీనిలో భాగస్వామ్యులను చేశారు. అయితే అధిష్టానం మాట భద్రాద్రి టీడీపీ తమ్ముళ్లు చెవికెక్కించుకుంటారా..?అనేది అనుమానమేనని పరిశీలకులు అంటున్నారు. -
టీడీపీతో ఈనాడు కుమ్మక్కై .... జగన్ వ్యతిరేక వార్తలు రాస్తోంది
ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఈనాడు దినపత్రిక.. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న కేసుల వివరాలను ప్రచురిస్తూ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతోందని, ఈ అంశంపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ శనివారం ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు అందజేశారు. నెలరోజులుగా వస్తున్న ‘ఈనాడు ఎన్నికల ప్రత్యేకం’ పేజీల్లో న్యాయస్థానాల్లో జగన్, వైఎస్‌పై విచారణలో ఉన్న కేసుల వివరాలను ప్రచురిస్తున్నారని, ఇలాంటివి ఎన్నికల వార్తలకింద ప్రచురించడం ‘సబ్‌జ్యుడిస్’ అవుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.ఈనాడు, టీడీపీ రెండూ కలిసి ఈ ఎన్నికల్లో జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు విచారణలో ఉన్న కేసుల వివరాలనేగాక.. తప్పుడు వార్తలను కూడా ప్రచురిస్తున్నాయని ఆయన ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అత్యధిక సర్క్యులేషన్ గలదిగా ఆ యాజ మాన్యం చెప్పుకుంటున్న ఈనాడు తన పాఠకులను ప్రభావితం చేయాలన్న దురుద్దేశ ంతోనే ఇలాంటి వార్తలను ప్రచురిస్తోందన్నారు. సరిగ్గా ఎన్నికల ముం దుగా టీడీపీ, ఈనాడు చేతులు కలిపి ఇలా ఒక రాజకీయపార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం తీవ్ర అభ్యంతరకరమేగాక, ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. ఒక రాజకీయ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీడీపీ ఒక దినపత్రికను సాధనంగా ఎన్నికల తరుణంలో వాడుకోవడం, తద్వారా ఓటర్ల సానుభూతి పొందాలని చూడటం తీవ్రంగా ఖండించాల్సిన అంశమని అభిప్రాయపడ్డారు.ఈ విషయంలో ఈనాడు-టీడీ పీల కుమ్మక్కుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.