Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Sakshi Editorial On Chandrababu Andhra Pradesh Politics By Vardhelli Murali
రెడ్‌బుక్‌ రాజ్యాంగం చెల్లదు!

ఇండోనేషియాలో లక్షలాదిమందిని ఊచకోత కోసిన సుహార్తో పాలన ఆదర్శంగా కనిపిస్తున్నదా? కాంబోడియాలో నెత్తుటేరులు పారించిన పోల్‌పాట్‌ మీకు రోల్‌మోడల్‌గా కనిపిస్తున్నాడా? చిలీ ప్రజల ప్రాథమిక హక్కులను తొక్కిపారేసిన ఆగస్టో పినోచెట్‌ ఉక్కుపాదం మీద మోజుపుట్టిందా? మరెందుకు మీ చేతిలోని ఆ రెడ్‌ బుక్‌? ఆ పుస్తకానికి హోర్డింగులెందుకూ... హారతులెందుకు?ఏముందా రెడ్‌బుక్‌లో? మీ విధానాలను బలంగా విరోధించే మీ రాజకీయ ప్రత్యర్థుల పేర్లు, మీ విమర్శకుల పేర్లు, మీ అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించని అధికారుల పేర్లు... అంతేగా! ఎన్నికలకు ముందు లోకేశ్‌బాబు జారీ చేసిన హెచ్చరికల తాత్పర్యం ఇదే కదా! ఒక ప్రమాణపూర్వక ప్రతీకార పొత్తానికి వీరపూజలు చేయడం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటవుతుందా? ఇటువంటి చర్యల వలన రాజ్యాంగబద్ధ పరిపాలనకు ప్రమాదం దాపురించదా? రాజ్యాంగబద్ధమైన పరిపాలన విఫలమైతే ఏం చేయాలనే విరుగుడు మంత్రం కూడా మన రాజ్యాంగంలో ఉన్న సంగతి తమకు తెలియనిదా?బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏలో షరీఖైన దగ్గర్నుంచీ తెలుగుదేశం శ్రేణులు చెలరేగిపోతున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎన్డీఏ విధేయ ఎన్నికల సంఘం ఆసరాతో పాలనా యంత్రాంగంపై పట్టు బిగించిన ఆ పార్టీ శ్రేణులు యథేచ్ఛగా ప్రవర్తించిన తీరు కూడా తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్‌ పోలింగ్‌కు ముందు మూడు దశల ఎన్నికలు దేశవ్యాప్తంగా జరిగాయి. అప్పటికే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి అతి పెద్ద రాష్ట్రాల ప్రజానాడి కూటమి పెద్దలకు అర్థమైపోయింది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ వంటి బలమైన బీజేపీ స్థావరాల్లో దాదాపుగా పోలింగ్‌ ఘట్టం పూర్తయింది. అయినా కనాకష్టంగానే ఎన్డీఏ హాఫ్‌ మార్క్‌ను దాటగలుగుతున్నదని నేతలకు రూఢీ అయింది.ఫలితాలు కూడా వారి అంచనాలకు తగినట్టుగానే వచ్చాయి. మూడు దశల్లోని 285 స్థానాల్లో ఎన్డీఏ 150 మార్క్‌ను దాటలేదు. మిగిలిన నాలుగు దశలు ఎన్డీఏ దశను మార్చాలి. మిగిలిన దశలు అంతగా అనుకూల ప్రాంతాలు కానప్పటికీ కూటమి గట్టెక్కగలిగింది. కానీ మాయమైపోయిన 20 లక్షల ఈవీఎమ్‌ల గురించి స్పష్టమైన సమాధానం ఇప్పటివరకూ రాలేదు. 140 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఎందుకున్నాయనే సందేహాన్ని తీర్చే నాథుడు కనిపించడం లేదు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కూటమి ఇచ్చిన జాబితా ప్రకారం ఎన్నికల సంఘం అధికారుల బదిలీలు ఎందుకు చేసిందో అర్థం కాలేదు.అధికార యంత్రాంగాన్ని కూటమి గుప్పెట్లోకి తీసుకోవడానికీ, తమ కంచుకోటల్లో సైతం వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడానికీ మధ్యన గల సంబంధం ఏమిటో తేలవలసి ఉన్నది. ఈ అంశంపై లోతైన అధ్యయనం జరగాలి. ఈలోగా రెడ్‌బుక్‌ స్ఫూర్తితో రాష్ట్రంలో మొదలైన బీభత్స పాలన ఫలితంగా అటువంటి అధ్యయనాలు ఇంకా టేకాఫ్‌ కాలేదు. కానీ ఆలస్యమైనా అవి జరుగుతాయి. నిజానిజాలను నిగ్గుతేలుస్తాయి. భవిష్యత్తు రాజకీయాలకు పాఠాలను అందజేస్తాయి.ఫలితాలను ప్రకటించి పది రోజులు దాటింది. అయినా రెడ్‌బుక్‌ బీభత్స పాలన తగ్గుముఖం పట్టలేదు. ఇళ్లపైనా, కార్యాలయాలపైనా దాడులు జరిగినా, ప్రత్యర్థులను చితక్కొట్టినా, అర్ధనగ్నంగా మార్చి కాళ్లు పట్టించుకుంటున్నా పోలీసులు ఫిర్యాదులు స్వీకరించడం లేదు. ఇకముందు కూడా రెడ్‌బుక్‌ రాజ్యాంగమే అమలు కానుందా అనే అనుమానాలకు సాక్షాత్తూ ఉన్నతస్థాయిలోని వారే ఊతమిస్తున్నారు. 1970వ దశకం నాటి బెంగాల్‌ రాజకీయ పరిణామాలను నేటి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు గుర్తుకు తెస్తున్నాయి.1972లో జరిగిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు బూటకపు ఎన్నికల పేరుతో ప్రచారంలోకి వచ్చాయి. పోలీసుల సహకారంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా బూత్‌లను ఆక్రమించి రిగ్గింగ్‌ చేసుకున్నారు. కౌంటింగ్‌ ప్రక్రియలోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓటమెరుగని జ్యోతిబసు సైతం ఓడిపోయినట్టు ప్రకటించారు. కేవలం 14 మంది మాత్రమే సీపీఎం నుంచి గెలిచినట్టు లెక్క తేల్చారు. దీంతో ఐదేళ్లపాటు ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించింది. ఈ ఐదేళ్లలో సిద్ధార్థ శంకర్‌రే ప్రభుత్వం ప్రతిపక్షాల అణచివేతకు తెగబడని దాష్టీకం లేదు. ఇప్పటి మాదిరిగా రెడ్‌బుక్‌ను పూజించలేదు కానీ ఇదే తరహా బీభత్స పాలనను ఐదేళ్లూ కొనసాగించారు. పాలక పార్టీ ఫలితాన్ని అనుభవించింది. 1977లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్‌ పార్టీ బెంగాల్‌లో ఇప్పటి దాకా కోలుకోనేలేదు.హింసాకాండతో, భయోత్పాతాలు సృష్టించడం ద్వారా ప్రత్యర్థులను కట్టడి చేయవచ్చనుకునే పాలకులు ఇటువంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం అవసరం. కానీ అటువంటి లక్షణాలైతే ఈ పది రోజుల్లో కనిపించలేదు. దేశంలోనే సీనియర్‌ రాజకీయవేత్తల్లో ఒకరైన చంద్రబాబుకు సుదీర్ఘమైన రాజకీయ, పాలనా అనుభవం ఉన్నది. కానీ, గడచిన రెండు మూడు రోజులుగా ఆయన అధికార యంత్రాంగంపై చేస్తున్న వ్యాఖ్యలు, చేపడుతున్న చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారుల మీద, ఉద్యోగుల మీద ఆయన రాజకీయ ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు.పోలీస్‌ స్టేషన్‌లో నేరస్థుల ఫోటోలు పెట్టినట్టుగా శనివారం నాటి ‘ఈనాడు’ పత్రికలో ఓ పదిహేనుమంది డీఎస్పీల ఫోటోలను వేశారు. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధమైన రాతలు రాశారు. ఉద్యోగుల పనితీరును మదింపు చేయవలసింది ఎవరు? ‘ఈనాడు’కు ఈ బాధ్యతను ఎవరు అప్పగించారు? ఇలా ప్రతిరోజూ ‘ఈనాడు’లో ఓ జాబితా రావడం, దానిపై చర్యలకు పూనుకోవడం జరుగుతుందనుకోవాలా? ఈ విధంగా రాజ్యాంగ, రాజ్యాంగేతర వ్యవస్థలు హద్దులు మీరి వ్యవహారాలు నడిపితే పరిపాలన గాడి తప్పదా? ఆదిలోనే గాడి తప్పుతున్న సూచనలు కనిపించడం శుభసంకేతమైతే కాదు.ఎన్డీఏ కూటమికి పెద్దన్నగా ఉన్న బీజేపీకి గానీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌కు గానీ భారత రాజ్యాంగం పట్ల అంతగా విశ్వాసం లేదన్న అభిప్రాయం ఉన్నది. ముఖ్యంగా రాజ్యాంగ పీఠికలోని ‘సెక్యులర్‌’, ‘సోషలిస్టు’ పదాలను తొలగించాలన్న తహతహ వారిలో ఉండవచ్చు. మూడింట రెండొంతుల మెజారిటీ కోసం బీజేపీ వెంపర్లాడింది కూడా రాజ్యాంగ సవరణ కోసమేననే వాదన కూడా ఉన్నది. బీజేపీ భావజాలానికి చంద్రబాబు సహజ మిత్రుడని భావించవలసి ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్‌ మరణం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడుసార్లూ చంద్రబాబు కాషాయ పార్టీ సహకారంతోనే నెగ్గుకొచ్చారు. బీజేపీ ‘మ్యాజిక్‌’ తోడవకుండా ఎన్నికల్లో గెలిచిన రికార్డు ఆయనకు లేదు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరును పెట్టినప్పుడు కొన్ని శక్తులు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డాయి. ఈ శక్తులకు తోడ్పాటును అందించిన రాజకీయ రూపాలేమిటనేది స్థానిక ప్రజలందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగ రచయిత మీద వీరికి ఉన్న వ్యతిరేకత రాజ్యాంగం మీద ఏమేరకున్నదో తెలియవలసి ఉన్నది. బీజేపీ కోరుకుంటున్నట్టుగా పీఠికలోని సెక్యులర్, సోషలిజం అనే రెండు పదాలను తొలగించినా కూడా మొత్తం రాజ్యాంగ స్వభావంలోంచి వాటి స్ఫూర్తిని తొలగించడం సాధ్యం కాదు. ఎటువంటి వివక్ష లేని స్వేచ్ఛ, సమానత్వాలకు, సమాన అవకాశాలకు రాజ్యాంగం పూచీపడుతున్నది. సమాన అవకాశాలను వినియోగించుకోగలిగే స్థాయికి వెనుకబడిన శ్రేణులను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలని కూడా ప్రభుత్వాలను రాజ్యాంగం ఆదేశిస్తున్నది.ఈ శతాబ్దంలోని ఆధిపత్య రాజకీయ వ్యవస్థలకూ, మన రాజ్యాంగం స్ఫూర్తికీ మధ్యన సైద్ధాంతిక విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న ఆధిపత్య రాజకీయపక్షాల్లో ఎక్కువ భాగం ‘ట్రికిల్‌ డౌన్‌’ ఆర్థిక విధానాలను అవలంబిస్తున్నవే. ఈ విధానాలను ఔదలదాల్చడంలో ఛాంపియన్‌ నెంబర్‌వన్‌ బీజేపీ, ఛాంపియన్‌ నెంబర్‌ టూ టీడీపీ. అందుకే ఇవి రెండూ సహజ మిత్రపక్షాలు. పెద్దపెద్ద కార్పొరేట్‌ సంస్థలు, మెగా రిచ్‌ వ్యక్తుల అనుకూల విధానాలను ట్రికిల్‌ డౌన్‌ ఎకనామిక్స్‌ ప్రోత్సహిస్తుంది. వీరు ఖర్చు చేయడం ద్వారా అంటే పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతో ఇంతో బతుకుతెరువు అడుగు వర్గాలకు కూడా లభిస్తుంది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.సంపన్నులు పెట్టుబడులు పెట్టడం కోసం సహజ వనరులను వారి పరం చేయాలి. వారికి శ్రమ శక్తి చౌకగా లభించాలి. వ్యవసాయ రంగం లాభసాటిగా ఉంటే అది సాధ్యం కాదు. విద్య, వైద్య రంగాల్లో కూడా ప్రైవేట్‌ పెట్టుబడులకే పెద్దపీట వేయాలి. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని స్వయంగా చంద్రబాబు చేసిన ప్రకటనలే మన ముందున్నాయి. ప్రైవేట్‌ విద్యావ్యవస్థలో నాణ్యమైన చదువు సంపన్న శ్రేణికి మాత్రమే లభిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రకమైన ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే పార్టీలు పేదలకోసం కొన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తాయి. కానీ, అవి సాధికారతకు బాటలు వేసే చర్యలు మాత్రం కాదు.రాజ్యాంగ లక్ష్యాలను అందుకోవడానికి ఎంపవర్‌మెంట్‌ ఎకనామిక్స్‌ అవసరమవుతాయి. వ్యక్తులను సాధికార శక్తులుగా మలచడంతో పాటు వారిలో ఆత్మగౌరవాన్ని ఉద్దీపింపజేయడానికి ఈ విధానాలు అవసరం. అయితే సమాజంలోని ఆధిపత్య వర్గాలు ఈ విధానాలను వ్యతిరేకిస్తాయి. వీటిని ప్రబోధించే రాజకీయ శక్తులను నిరోధిస్తాయి. ఏపీలో జరిగిన ఎన్నికలను ఈ నేపథ్యంలోంచి కూడా పరిశీలించాలి. ఈ విధానాల ఘర్షణను ప్రజలకు వివరించి చెప్పడం అంత సులభసాధ్యమేమీ కాదు. అనేక సామాజిక – సాంస్కృతిక సంక్లిష్టతల కారణంగా నిట్టనిలువునా వర్గ విభజన చేయడం కూడా కష్టమైన పని.నెలకు రెండు లక్షలు సంపాదించేవాడూ, నెలకు పదివేలు సంపాదించేవాడూ కూడా మన దగ్గర మధ్యతరగతిగానే చలామణీ కావడానికి ఇష్టపడతారు. పదివేలవాడు పేదవాడిగా ఒప్పుకోడు. పేదరికం అంటే కూటికి లేకపోవడమనే అభిప్రాయం నుంచి మనం ఇంకా బయటపడలేదు. నాణ్యమైన విద్య దొరక్కపోవడం పేదరికం, సమాన అవకాశాలు లభించకపోవడం పేదరికం, హస్తిమశకాంతరం పెరిగిన ఆర్థిక వ్యత్యాసాల్లో అడుగుభాగాన నిలవడం పేదరికం, కోరుకున్న జీవన గమనాన్ని సాధించుకోలేకపోవడం పేదరికమనే స్పృహ మనకింకా రాలేదు.వెనుకబడిన వర్గాలుగా గుర్తింపు పొందిన వారిలోని క్రీమీ లేయర్‌ కూడా తన సాటి సామాజిక శక్తులతో జతకూడటానికి బదులు సవర్ణ హిందూ సమాజంతో స్నేహం చేయడాన్నే గౌరవంగా భావించుకుంటారు. గ్రామాల్లో పదిహేనెకరాలున్న ఆసామి కూడా జీవన ప్రమాణాల రీత్యా పేదవాడికిందే లెక్క. కానీ, తన సామాజిక స్థానం దృష్ట్యా తనను తాను పెత్తందారుగా భావించుకునే విచిత్ర పరిస్థితి ఉన్నది. ఈ సంక్లిష్టతలను ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయి.కానీ పరిపాలనా ప్రా«ధమ్యాల వల్ల అనుభవ పూర్వకంగా మిత్రుడెవరో శత్రువెవరో జనం తెలుసుకుంటారు. అన్ని కులాలు, మతాల్లోని ప్రజలంతా తాము పోగొట్టుకున్నదేమిటో గ్రహిస్తారు. ఈ గ్రహింపే సాధికారతను కోరుకునే ప్రజలందరినీ ఏకం చేస్తుంది. సిద్ధాంతరీత్యా, విధానాల రీత్యా చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సాధికారతకు వ్యతిరేకం. కనుక సాధికారతా శక్తులు బలపడకుండా అది బలప్రయోగానికి దిగుతూనే ఉంటుంది. రెడ్‌బుక్‌తో బెదిరిస్తూనే ఉంటుంది. కానీ అణచివేతలు, భయోత్పాతాలు అంతిమ విజయాలు సాధించిన దాఖలాలు లేవు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం చెల్లదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Fathers Who Played Key Roles In Indian Star Cricketers Careers
ఈ టీమిండియా స్టార్ల సక్సెస్‌ వెనుక హీరోలు తండ్రులే..!

ప్రతి వ్యక్తి జీవితంలో మొదటి హీరో, మొదటి గురువు నాన్నే. రంగం ఏదైనా ఓ వ్యక్తి రాణించాలంటే అందులో కీలకపాత్ర తండ్రిదే. నాన్న పిల్లల చేయి పట్టుకుని ప్రపంచానికి పరిచయం చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాడు. పిల్లల ఉన్నతి కోసం అహర్నిశలూ శ్రమించి సర్వస్వం ధారపోస్తాడు.తాను పడ్డ కష్టాలు, తాను చేసిన త్యాగాలకు ఏనాడూ ప్రతిఫలం ఆశించని నిస్వార్థ వ్యక్తి నాన్న. అలాంటి త్యాగమూర్తికి 'ఫాదర్స్ డే'ను (జూన్‌ 16) పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేద్దాం.ప్రతి మనిషి సక్సెస్‌ వెనుక నిజమైన హీరో తండ్రే. రంగం ఏదైనా ఓ వ్యక్తి రాణించాడంటే దాని వెనుక తండ్రిదే ప్రధానపాత్ర. ఫాదర్స్‌ డే సందర్భంగా క్రీడారంగానికి (క్రికెట్‌) సంబంధించి బిడ్డల కోసం త్యాగాలు చేసిన తండ్రులపై ఓ ప్రత్యేక కథనం.శుభ్‌మన్‌ గిల్‌-లఖ్విందర్‌ సింగ్‌: భారత క్రికెట్‌ జట్టు ప్రిన్స్‌గా పిలువబడే శుభ్‌మన్‌ గిల్‌ తండ్రి పేరు లఖ్విందర్‌ సింగ్‌. లఖ్విందర్‌ సింగ్‌ తన కొడుకు క్రికెట్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో కీలకపాత్ర పోషించాడు. గిల్‌ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో రాణిస్తున్నాడంటే అది తండ్రి లఖ్విందర్‌ చలువే. గిల్‌ కెరీర్‌ కోసం లఖ్విందర్‌ ఎన్నో త్యాగాలు చేశాడు. ఇండియా-పాకిస్తాన్‌ బోర్డర్‌లోని ఫాజిల్కా అనే కుగ్రామానికి చెందిన లఖ్విందర్‌.. కొడుకు కెరీర్‌లో కోసం 300 కిమీ దూరంలో ఉన్న మొహాలీ నగరానికి మకాం మార్చాడు. గిల్‌ను క్రికెటర్‌ చేసేందుకు లఖ్విందర్‌ 15 సంవత్సరాలు తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకున్నాడు. తిండి పెట్టే వ్యవసాయాన్ని సైతం వదిలి పెట్టి నగరవాసం చేశాడు.గిల్‌ క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో లఖ్విందర్‌ తన గ్రామంలో జరిగే ఏ శుభకార్యానికి హాజరు​కాలేదు. తాను ఫంక్షన్లకు వెళితే కొడుకు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ఏవో కారణాలు చెప్పి హాజరయ్యేవాడు కాదు. గిల్‌కు ఆటపై ఉన్న ఆసక్తిని గమనించిన లఖ్విందర్‌ ఊరిలో ఉన్న ఆస్తులు అమ్ముకున్నాడు. తానే కోచ్‌గా మారి గిల్‌ను ప్రతి రోజు 500-700 బంతులు ఆడేలా చేసేవాడు. బ్యాట్‌తో ఆడేప్పుడు మిడిల్‌ చేసేందుకు తోడ్పడుతుందని వికెట్‌తో ప్రాక్టీస్‌ చేయించేవాడు. గిల్‌ ప్రస్తుత తరం క్రికెటర్లలో అగ్రగణ్యుడిగా ఉన్నాడంటే దాని వెనుక తండ్రి లఖ్విందర్‌ చేసిన ఇలాంటి త్యాగాలు ఎన్నో ఉన్నాయి.యువరాజ్‌ సింగ్‌-యోగ్‌రాజ్‌ సింగ్‌: టీమిండియా లెజెండరీ ఆల్‌రౌండర్‌, టు టైమ్‌ వరల్డ్‌కప్‌ విన్నర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి పేరు యోగ్‌రాజ్‌ సింగ్‌. స్వతాహాగా క్రికెటర్‌ అయిన యోగ్‌రాజ్‌ సింగ్‌.. యువరాజ్‌ క్రికెట్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించడంలో కీలకపాత్ర పోషించాడు. భారత్‌ తరఫున ఆరు వన్డేలు, ఓ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడిన యోగ్‌రాజ్‌.. క్రికెట్‌లో తాను సాధించలేని ఉన్నతిని తన కొడుకు ద్వారా సాకారం చేసుకోవాలని కోరుకున్నాడు. ఇందుకోసం తన కొడుకు చాలా కష్టపెట్టాడు. యువరాజ్‌కు చిన్నతనంలో క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. యువరాజ్‌ స్కేటింగ్‌లో రాణించాలని అనుకున్నాడు. ఇందులో ఓ గోల్డ్‌ మెడల్‌ కూడా సాధించాడు. తన కొడుకు క్రికెటర్‌గానే రాణించాలని భీష్మించుకు కూర్చున్న యోగ్‌రాజ్‌.. యువరాజ్‌ సాధించిన గోల్డ్‌ మెడల్‌ను విసిరికొట్టి, క్రికెట్‌పై ఏకగ్రాత సాధించేలా చేశాడు. తొలుత అయిష్టంగానే క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టిన యువరాజ్‌ నెమ్మదిగా ఆటపై పట్టు సాధించి ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కించుకున్నాడు. యువరాజ్‌ తండ్రి మాట పెడచెవిన పెట్టి ఉంటే భారత్‌ క్రికెట్‌ ఓ గొప్ప యోధుడి సేవలను కోల్పోయి ఉండేది. యువరాజ్‌ సభ్యుడిగా ఉన్న భారత జట్టు 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ టైటిళ్లను సొంతం చేసుకుంది.సర్ఫరాజ్‌ ఖాన్‌-నౌషద్‌ ఖాన్‌: టీమిండియా యంగ్‌ తరంగ్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రి పేరు నౌషద్‌ ఖాన్‌. సర్ఫరాజ్‌ అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌లో (టెస్ట్‌ల్లో) అడుగుపెట్టిన తొలినాళ్లలోనే గుర్తింపు తెచ్చుకున్నాడంటే దాని వెనుక అతని తండ్రి ఊహకందని త్యాగం, కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష ఉన్నాయి. చిన్నతనం నుంచి సర్ఫరాజ్‌ను క్రికెటర్‌ చేయాలని పరితపించిన నౌషద్‌ ఖాన్‌ తన వ్యక్తిగత జీవితాన్ని సైతం పక్కన కొడుకు ఉన్నతి కోసం​ అహర్నిశలు శ్రమించాడు. ఆటగాడిగా తీర్చిదిద్దేందుకు నౌషద్‌ తన కొడుకును ఎంతో కష్టపెట్టాడు, బాధించాడు. సర్ఫరాజ్‌కు తండ్రే కోచ్‌గా, మెంటార్‌ వ్యవహరించాడు. సర్ఫరాజ్‌కు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నౌషద్‌ బిడ్డతో పాటు శ్రమించి తాననుకున్న లక్ష్యాన్ని నేరవేర్చుకున్నాడు. సర్ఫరాజ్‌ టీమిండియా అరంగేట్రం ప్రతి క్రికెట్‌ అభిమానిని భావోద్వేగానికి గురి చేసింది. సర్ఫరాజ్‌ తొలి టెస్ట్‌కు ముందు నౌషద్‌ మైదానంలో కంటతడి పెట్టిన దృశ్యాలు ప్రతి భారతీయుడి మనసును హత్తుకున్నాయి.

MK Stalin Dig at modi mention of sweet box by Rahul Gandhi victory rally
‘ఒక్క సీట్‌ బ్యాక్స్‌తో మోదీ ఇమేజ్‌కు రాహుల్‌ చెక్‌’

చెన్నై: లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎనిమిదిసార్లు తమిళనాడుకు వచ్చిన సాధించుకున్న ఇమేజ్‌ను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఒక్క స్వీట్‌ బాక్స్‌తో ముక్కలు చేశాని సీఎం ఎంకే స్టాలిన్‌ అన్నారు. కోయంబత్తూరులో డీఎంకే పార్టీ ఏర్పాటు చేసిన లోక్‌సభ ఎన్నిక ‘విజయ ర్యాలీ’సభలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానిమోదీపై విమర్శలు గుప్పించారు.‘‘ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నేను చివరిసారి కోయంబత్తూరు వచ్చినప్పడు నా పర్యటన దేశవ్యాప్తంగా ట్రెండ్‌ అయింది. మోదీ తమిళనాడకు 8 సార్లు పర్యటించి పొందిన ఇమేజ్‌ను కోయంబత్తూరులో రాహుల్‌ గాంధీ నాకు కేవలం ఒక స్వీట్‌ బ్యాక్స్‌ ఇ​చ్చి ముక్కలు చేశారు. నేను బోయంబత్తూరు ఉన్న సమయంలో రాహుల్‌ తమిళనాడుకు వచ్చిన రాహుల్‌ నాకు స్వీట్‌ బాక్స్‌ ఇచ్చారు. సోదరుడు రాహుల్‌ గాంధీ నాపై చూపిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోను’’ అని స్టాలిన్‌ అన్నారు.నరేంద్ర మోదీ బీజేపీ సొంతబలంతో ప్రధానమంత్రి కాలేదని, భాగస్వామ్య పార్టీల సాయంతో ప్రధాని అయ్యారని ఎద్దేవా చేశారు. భాగస్వామ్య పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం మోదీ ఫెయిల్యూర్‌ అని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన విజయం సాధారణమే అయినప్పటికి.. మోదీని సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేకుండా చేయటంలో ‘చారిత్రాత్మక విజయం’గా మారిందని అ‍న్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో మొత్త 40 స్థానాల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి విజయం సాధించిందన్నారు. అయితే బీజేపీ రాజ్యాంగాన్నిమార్చుతామని చెప్పిందని, ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి 41వ విజయం సాధించిందని అన్నారు. ఇదే విజయన్ని 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం రిపీట్‌ చేస్తామని స్టాలిన్‌ ధీమా వ్యక్తం చేశారు.

Power Struggle Between Tdp Leaders Gandi Babji And Bandaru Satyanarayana Murthy
గండి బాబ్జీ Vs బండారు.. టీడీపీలో మరోసారి ఆధిపత్య పోరు బహిర్గతం

సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. గండి బాబ్జీ, బండారు సత్యనారాయణ మూర్తి మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. బండారుకి వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా గండి బాబ్జీ మాట్లాడుతున్నారు. గతంలో బండారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తనను ఏ కార్యక్రమానికి పిలవలేదని.. పెందుర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తనకు తగిన గౌరవం ఇవ్వాలంటూ గండి బాబ్జీ వ్యాఖ్యానించారు.ఇప్పుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తనకు తెలియకుండా ఏ కార్యక్రమం పెట్టడానికి వీల్లేదన్నారు. గండి బాబ్జీ వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా బండారు తనయుడు అప్పలనాయుడు కౌంటర్ ఇచ్చారు. పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా ఎలా మెలగాలో నాకు తెలుసు.. గత్యంతరం లేక వేరే పార్టీల నుంచి వచ్చిన వారి నుంచి నేర్చుకోవలసిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు.

Bacteria Spreading in Japan can Kill in 2 Days
దడ పుట్టిస్తున్న కొత్త బ్యాక్టీరియా.. సోకితే రెండు రోజుల్లో మృతి?

జపాన్‌లో అరుదైన వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియా ప్రాణాంతకమని, దీని బారిన పడిన బాధితులు రెండు రోజుల్లో మృతి చెందే అవకాశం ఉన్నదని జపాన్‌ వైద్య నిపుణులు చెబుతున్నారు.జపాన్‌లో కరోనా పీరియడ్ ఆంక్షలు సడలించిన అనంతరం ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతూ వస్తోంది. వైద్యుల అంచనా ప్రకారం ఈ వ్యాధి మనిషిని 48 గంటల్లో మృత్యు ఒడికి చేరుస్తుంది. ఈ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధిని ‘స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్’ (ఎస్‌టీఎస్‌ఎస్‌) అని అంటారు.జపాన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ తెలిపిన వివరాల ప్రకారం 2024, జూన్ 2 నాటికి ఈ వ్యాధి కేసులు 977కి చేరుకున్నాయి. గతేడాది 941 కేసులు నమోదయ్యాయి. ఈ ఇన్స్టిట్యూట్ 1999 నుంచి ఈ వ్యాధికి సంబంధించిన రికార్డులను భద్రపరుస్తోంది.ఈ వ్యాధి సోకినప్పుడు గొంతు నొప్పి మొదలవుతుంది. అలాగే శరీరంలోని వివిధ అవయవాల్లో వాపు, నొప్పి జ్వరం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఇది శ్వాస సమస్యలు, అవయవ వైఫల్యానికి దారితీసి చివరికి బాధితుడిని మృత్యు ఒడికి చేరుస్తుంది. 50 ఏళ్లు పైబడిన వారిలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం అధికంగా ఉంటున్నదని పలు పరిశోధనల్లో తేలింది.ఈ వ్యాధి గురించి టోక్యో ఉమెన్స్ మెడికల్ యూనివర్శిటీకి చెందిన అంటు వ్యాధుల ప్రొఫెసర్ కెన్ కికుచి మాట్లాడుతూ ఈ వ్యాధి సోకినప్పుడు మరణం 48 గంటల్లో సంభవించే అవకాశం ఉన్నదన్నారు. జపాన్‌లో ఈ ఏడాది చివరినాటికి ఈ కేసుల సంఖ్య 2,500కి చేరుకోవచ్చని కికుచి తెలిపారు.

Anand Mahindra Tweet About Ambassador Scale Model
ఇలాంటివి మనమెందుకు చేయడం లేదు!.. ఆనంద్ మహీంద్రా ట్వీట్

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పటికప్పుడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ పోస్ట్ చేశారు. ఇందులో స్కేల్ మోడల్ అంబాసిడర్ కారు ఉంది.ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ వేదికగా స్కేల్ మోడల్ హిందూస్తాన్ అంబాసిడర్ కార్లను పోస్ట్ చేస్తూ.. నేను ఈ ప్రతాప్ బోస్ నుంచి ఓ గిఫ్ట్ అందుకున్నారు. నా పాతకాలపు జ్ఞాపకాల్లో ఎప్పటికీ అంబాసిడర్ గుర్తుండిపోతుంది.భారతదేశంలో ఈ కారుకు గొప్ప చరిత్ర ఉంది. దేశంలో ఈ కారుకు విడదీయలేని బంధం ఉంది. కాబట్టి ఇది అమరత్వం పొందేదుకు ఖచ్చితంగా అర్హమైనది. మనదేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన ఈ స్కేల్ మోడల్‌ను చైనా నుంచి కాకుండా బంగ్లాదేశ్ నుంచి దిగుమతి చేసుకున్న విశాల్ బింద్రేకి ధన్యవాదాలు. ఇలాంటి నమూనాలను మనం ఎందుకు రూపొందించుకోవడం లేదు అంటూ ప్రశ్నించారు.ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతి తక్కువ సమయంలోనే వేలసంఖ్యలో లైక్స్ పొందిన ఈ ట్వీట్ మీద పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.Received a cool gift today from @BosePratap The Ambassador will never fade from the memories of someone of my vintage. What an old warhorse it was. An inextricable part of the old Indian landscape. So it deserves to be immortalised through such scale models. And kudos to… pic.twitter.com/wkO4gO2lC7— anand mahindra (@anandmahindra) June 15, 2024

Nayanthara, Kiara Advani, Huma Qureshi To Act In Yash Toxic Movie
యశ్‌ ‘ టాక్సిక్‌ ’లో ముగ్గురు భామలు.. కరీనా ప్లేస్‌లో నయనతార!

తమిళసినిమా: కేజీఎఫ్‌ చిత్రం తరువాత ఆ చిత్ర కథానాయకుడు నటించే చిత్రం అంటే ఆ రేంజ్‌కు ఏమాత్రం తగ్గకూడదు. ఎందుకంటే అంత ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి మరి. నటుడు యష్‌ అలాంటి జాగ్రత్తలే తీసుకుంటున్నారనిపిస్తోంది. కేజీఎఫ్‌ 1, 2 చిత్రాల తరువాత ఈయన టాక్సిక్‌ అనే చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపొందనున్న ఈ పాన్‌ ఇండియా చిత్రానికి మహిళా దర్శకురాలు గీతు మోహన్‌దాస్‌ తెరకెక్కించనున్నారు. దీంతో చిత్రంలో మల్టీ భాషలకు చెందిన ప్రముఖ తారాగణం నటించనున్నారు. ముఖ్యంగా బీబీసీ సీరీస్‌ పిక్కీ బ్‌లైండర్స్‌ తరహాలో తెరకెక్కనున్న ఈ గ్యాంగ్‌స్టర్స్‌ కథా చిత్రంలో యష్‌ సరసన కియారా అద్వానీ నాయకిగా నటించనున్నారు. మరో ప్రధాన పాత్రలో కరీనాకపూర్‌ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆమె పాత్రలో నయనతార వచ్చి చేరినట్లు తెలిసింది. ఇందులో ఈమె యష్‌కు సిస్టర్‌గా నటించనున్నట్లు సమాచారం. అదేవిధంగా మరో బాలీవుడ్‌ భామ హ్యూమా ఖురేషి కీలక పాత్రను పోషించనున్నారని తెలిసింది. మరో విషయం ఏమిటంటే దర్శకురాలు ఈ చిత్ర షూటింగ్‌ను 200 రోజుల్లో పూర్తిచేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. అందులో 150 రోజులు లండన్‌ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించనున్నట్లు సమాచారం. అందుకోసం చిత్ర యూనిట్‌ త్వరలో యూకేకు బయలుదేరనున్నట్లు తెలిసింది. ఇకపోతే ఈ చిత్రాన్ని 2025, ఏప్రిల్‌ 10వ తేదీన తెరపైకి తీసుకురావాలని నిర్ణయించనట్లు తెలిసింది.

Complaint by victim Paleti Rajkumar to Human Rights Commission
చినబాబు బ్యాచ్‌ చిత్రహింసలు!

సాక్షి, అమరావతి: మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేశ్‌ అనుచరులు ఈ నెల 9వ తేదీన తనను కిడ్నాప్‌ చేసి రాత్రంతా చిత్ర హింసలకు గురి చేసినట్లు పెదవడ్లపూడికి చెందిన బాధితుడు పాలేటి రాజ్‌కుమార్‌ సుప్రీం కోర్టు, హైకోర్టు, జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. లోకేశ్‌ ఫ్లెక్సీ ఎదుట మోకాళ్లపై కూర్చోబెట్టి బెదిరించి క్షమాపణ చెప్పించి చిత్రీకరించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి తన కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నట్లు పేర్కొన్నాడు.వీటి ప్రభావంతో పాఠశాలలో చదువుతున్న తన పిల్లలు అవమానభారంతో ఇంటికొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నేతలు పదే పదే బెదిరింపులకు దిగుతున్నారని, తక్షణమే జోక్యం చేసుకుని అరికట్టకుంటే తన కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమని విన్నవించుకున్నాడు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జాతీయ మానవహక్కుల సంఘానికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదుపై చట్టప్రకారం పోలీసులతో విచారణ జరిపి వ్యక్తిగత, భావ ప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కులను పరిరక్షించాలని కోరాడు. ఫిర్యాదులో ముఖ్యాంశాలు ఇవీ.. ⇒ మంగళగిరి నియోజకవర్గంలో 2019–24 మధ్య వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను మా కుటుంబంతో కలసి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశా. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలపై దాడులకు పాల్పడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. నారా లోకేశ్‌ అండదండలతో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. ⇒ ఈ నెల 9వతేదీన సాయంత్రం 4.30 గంటల సమయంలో నారా లోకేశ్‌కు సన్నిహితుడైన జవ్వాడి కిరణ్‌చంద్‌ అనుచరులు నరేంద్ర, షేక్‌ బాజీ, జానీ తదితరులు నేను మా అత్త ఇంట్లో ఉన్న సమయంలో మారణాయుధాలతో దాడి చేశారు. ఫరీ్నచర్‌ను ధ్వంసం చేశారు. ఏపీ 39 జీబీ 3333 వాహనంలో నన్ను కిడ్నాప్‌ చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించి రాత్రంతా చిత్రహింసలకు గురిచేశారు. నా చొక్కా విప్పించి నారా లోకేశ్‌ ప్లెక్సీ ఎదుట మోకాళ్లపై మోకరిల్లి ముకుళిత హస్తాలతో క్షమాపణ చెప్పాలని బెదిరించి వీడియో చిత్రీకరించారు. ఈనెల 10వతేదీ తెల్లవారు జాము 4 గంటలకు బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై వదిలేసి వైఎస్సార్‌ సీపీకి మద్దతు పలికితే ఎవరికైనా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ⇒ నాపై దాడి చేసిన వారిపై అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు (ఎఫ్‌ఐఆర్‌ నెంబరు 78/2024) చేశా. ఫిర్యాదు వాపసు తీసుకోవాలంటూ టీడీపీ మద్దతుదారులు పదే పదే ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు నా ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ⇒ మానవ హక్కులను కాలరాయడంపై తక్షణమే జోక్యం చేసుకుని టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి నాకు, నా కుటుంబానికి రక్షణ కలి్పంచాలి. నా ఫిర్యాదుపై చట్టప్రకారం విచారణకు ఆదేశించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నా.

Weekly Horoscope From 16 June 2024 To 22 June 2024 In Telugu
ఈ వారం మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషంఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కవచ్చు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. పోటీపరీçక్షల్లో అనుకూల ఫలితాలు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లకు అవకాశం. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, ఎరుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.వృషభంపనులు సకాలంలో పూర్తయి ఊపిరిపీల్చుకుంటారు. శ్రమ ఫలించే సమయం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో రాజీపడతారు. చర,స్థిరాస్తుల వృద్ధి. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయ, కళారంగాల వారికి అనుకోని అవకాశాలు. సన్మానయోగం. వారం ప్రారంభంలో శ్రమ వృధా. బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఆందోళన. చాక్లెట్, ఆకుపచ్చ రంగులు, కనకధారాస్తోత్రాలు పఠించండి.మిథునంవ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. మీ ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. ఇంటి నిర్మాణంలో ఎదురైన ఇబ్బందులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు ఒక హోదా దక్కవచ్చు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఇంటాబయటా ఒత్తిడులు. ఖర్చులు అధికం. గులాబీ, తెలుపు రంగులు, పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి.కర్కాటకందీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు. తండ్రితరఫు వారి నుంచి ధన, వస్తులాభాలు ఉంటాయి. శ్రేయోభిలాషుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార వృద్ధి, కొత్త పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో దూరప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. తెలుపు, చాక్లెట్‌రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.సింహంపనులలో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు, మీ నిర్ణయాలను బంధువులు వ్యతిరేకిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉండి లాభాలు నామమాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తప్పకపోవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. ధనలబ్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నేరేడు, లేత ఆకుపచ్చరంగులు, హనుమాన్‌ ఛాలీసా పఠించండి.కన్యఅదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు ఒక సమాచారంతో ఊరట చెందుతారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయ, కళారంగాల వారికి ఊహించని పిలుపు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువర్గంతో తగాదాలు. ఎరుపు, బంగారురంగులు, శివపంచాక్షరి పఠించండి.తులకొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబసభ్యుల్లో అనుమానాలు నివృత్తి చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా పడతాయి. పసుపు, తెలుపురంగులు, గణేశాష్టకం పఠించండి.వృశ్చికంకొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. రావలసిన బాకీలు అంది ఖర్చులకు ఇబ్బంది ఉండదు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడవచ్చు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు దక్కుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయ, కళారంగాలవారికి విదేశీ పర్యటనలు.వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. నేరేడు, లేత ఎరుపు రంగులు, గణేశాష్టకం పఠించండి.ధనుస్సుఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న వ్యవహారాలు పూర్తయ్యే వరకూ విశ్రమించరు. ఆలోచనలు అమలు చేసి అందర్నీ ఆకట్టుకుంటారు. కుటుంబంలో మీ పాత్ర పెరుగుతుంది. ఇంతకాలం పడిన ఇబ్బందులు, సమస్యలు తీరే సమయం. పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో నిరాశ తొలగి అడుగు ముందుకు పడుతుంది. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, తెలుపు రంగులు. రాఘవేంద్రస్వామిని స్మరించండి.మకరంఅనుకున్న వెంటనే పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఏదీ అసంపూర్తిగా విడిచిపెట్టరు. గతాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తారు. స్థిరాస్తులు కొనుగోలుకు ఉన్న అడ్డంకులు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని ఖర్చులు చేస్తారు. దూరపు బంధువుల ద్వారా శుభవార్తలు అందుతాయి. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు. ఊహించని ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది. వ్యాపారాలు సమృద్ధిగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఊరట కలుగుతుంది. బాధ్యతల భారం తగ్గవచ్చు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. ప్రయాణాలలో ఆటంకాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.కుంభంసంఘంలో మీరు చెప్పిన విషయాలు అందర్నీ మెప్పిస్తాయి. కుటుంబంలోనూ కీలకంగా మారతారు. వివాహాది ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. రుణబాధల నుండి విముక్తి లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యక్తి ద్వారా అత్యంత కీలక విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు విస్తరణకు సమాయత్తమవుతారు. ఉద్యోగాలలో ఈతిబాధలు, సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహం పెరుగుతుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. చోరభయం. నిర్ణయాలలో మార్పులు. పసుపు, నీలం రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.మీనంఎటువంటి వ్యవహారమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి అధికంగా అందులో గడుపుతారు. విద్యార్థుల యత్నాలు కొలిక్కి వచ్చే వీలుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆర్థిక లావాదేవీలు చాకచక్యంగా నిర్వహించి అప్పులు చేయకుండా గడుపుతారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలుకు వస్తున్న ఆటంకాలు అధిగమిస్తారు. సోదరుల నుండి ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలను మరింత విస్తరిస్తారు. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో సమర్థతను చాటుకుంటారు. రాజకీయవర్గాలకు ఒక ఊహించని పదవి దక్కవచ్చు. గులాబీ, ఎరుపు రంగులు. వారం మ«ధ్యలో ఆరోగ్యభంగం. శ్రమా«ధిక్యం. శివాష్టకం పఠించండి.

G7 Summit 2024: G7 blames China for enabling Ukraine war
G7 Summit 2024: చైనా అండతోనే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం

రోమ్‌: 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై రెండేళ్లకుపైగా దాడులు కొనసాగించే శక్తి రష్యాకు ఎలా వచి్చంది? అమెరికాతోపాటు పశి్చమ దేశాలు డ్రాగన్‌ దేశం చైనా వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. చైనా అండదండలతోనే ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం క్షిపణులు, డ్రోన్లతో భీకర దాడులు చేస్తోందని, సాధారణ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందని జీ7 దేశాలు ఆరోపించాయి. ఇటలీలో సమావేశమైన జీ7 దేశాల అధినేతలు తాజాగా ఈ మేరకు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా అండ చూసుకొని రష్యా రెచి్చపోతోందని ఆరోపించారు. రష్యా యుద్ధ యంత్రానికి చైనానే ఇంధనంగా మారిందని జీ7 దేశాలు మండిపడ్డారు. రష్యాకు మిస్సైళ్లు డ్రోన్లు చైనా నుంచే వస్తున్నాయని ఆక్షేపించారు. జీ7 దేశాలు సాధారణంగా రష్యాను తమ శత్రుదేశంగా పరిగణిస్తుంటాయి. ఈ జాబితాలో ఇప్పుడు చైనా కూడా చేరినట్లు కనిపిస్తోంది. మారణాయుధాలు తయారు చేసుకొనే పరిజ్ఞానాన్ని రష్యాకు డ్రాగన్‌ అందిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ విమర్శించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు చైనా నేరుగా ఆయుధాలు ఇవ్వకపోయినా ఆయుధాల తయారీకి అవసరమైన విడిభాగాలు, ముడి సరుకులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేస్తోందని ఆక్షేపించారు. చైనాలో మానవ హక్కుల ఉల్లంఘన ఉక్రెయిన్‌లో మారణహోమం సృష్టించేలా రష్యాకు సహకరిస్తున్న దేశాలపై, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకతప్పదని జీ7 దేశాల అధినేతలు తేలి్చచెప్పారు. ఉక్రెయిన్‌పై చట్టవిరుద్ధమైన యుద్ధానికి మద్దతివ్వడం మానుకోవాలని హితవు పలికాయి. ఉక్రెయిన్‌పై దాడుల తర్వాత రష్యాపై పశి్చమ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో తమకు అవసరమైన సరుకులను చైనా నుంచి రష్యా దిగుమతి చేసుకుంటోంది. అలాగే రష్యా నుంచి చైనా చౌకగా చమురు కొనుగోలు చేస్తోంది. ఇరుదేశాలు పరస్పరం సహరించుకుంటున్నాయి. టిబెట్, షిన్‌జియాంగ్‌తోపాటు హాంకాంగ్‌లో చైనా దూకుడు చర్యలను జీ7 సభ్యదేశాలు తప్పుపట్టాయి. చైనా మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతోందని ఆరోపించాయి. మరోవైపు డ్రాగన్‌ దేశం అనుసరిస్తున్న వ్యాపార విధానాలను అమెరికాతోపాటు యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) దేశాలు తప్పుపడుతున్నాయి. ఎలక్ట్రికల్‌ వాహనాలు, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులు, సోలార్‌ ప్యానెళ్ల తయారీకి చైనా ప్రభుత్వం భారీగా రాయితీలిస్తోంది. దీంతో ఇవి చౌక ధరలకే అందుబాటులో ఉంటూ విదేశీ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా ఆయా దేశాల్లో వీటిని తయారు చేసే కంపెనీలు గిరాకీ లేక మూతపడుతున్నాయి. ఫలితంగా ఉద్యోగాల్లో కోతపడుతోంది. చైనా దిగుమతులతో పశి్చమ దేశాలు పోటీపడలేకపోతున్నాయి. చైనా ఎత్తుగడలను తిప్పికొట్టడానికి చైనా ఉత్పత్తులపై అమెరికాతోపాటు ఈయూ దేశాలు భారీగా పన్నులు విధిస్తున్నాయి.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement