భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏం చేసినా సంచలనం, వైరల్‌గా మారుతుంది. సెంచరీ చేసినా, డాన్స్ చేసినా వైరల్ అవుతుంది. తాజాగా ఇటీవల సన్నిహితుల పెళ్లికి హాజరైన కోహ్లీ మరోసారి తన దైన శైలిలో వార్తల్లో నిలిచాడు. ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్ విజయవంతమైన తర్వాత విరాట్ కోహ్లీ కొంత విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్యాప్‌లో విరాట్ సరదాగా కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు