సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సెలబ్రిటీలలో టీమిండియా మాజీ క్రికెటర్, విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఒకరు. ప్రకృతి గురించి ఆలోచించాలంటూ ప్రభుత్వాలతో పాటు పలువురు సెలబ్రిటీలు
తరచుగా చెబుతుంటారు. ఈ క్రమంలో సెహ్వాగ్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చెక్క(కట్టె)తో రూపొందించిన బైక్‌పై వెళ్తుండగా ఈ వీడియో తీశారు. బైకు మీద వెళ్తున్న వ్యక్తికి తన
బైక్‌తో పాటు ప్రకృతి అంటే కూడా చాలా ఇష్టమంటూ ట్వీట్ చేశారు. కచ్చితంగా వాడాల్సిన పార్ట్స్ మినహా ఇతర బైక్ విడి భాగాలు చెక్కతో తయారు చేశారు. ప్రకృతితో కలిసి ఉంటున్న భావన కలగాలని అతడు ఈ బైక్ వాడుతున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా, చెట్లను కొట్టివేసి బైకును తయారుచేశారు కదా అని మరికొందరు ట్వీట్లు మొదలుపెట్టారు.
చెక్క బైక్‌పై సెహ్వాగ్
Jun 8 2018 11:21 AM | Updated on Mar 21 2024 10:47 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement