ఇటలీలో రహస్యంగా పెళ్లి చేసుకోని ఒక్కటైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అనుష్కశర్మలపై అటు అభిమానులు.. ఇటు ప్రముఖుల అభినందనల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సౌతాఫ్రికా క్రికెటర్, కోహ్లి ఐపీఎల్ టీమ్‌మెట్ ఏబీ డివిలియర్స్ లేట్‌గా చెప్పిన లేటెస్ట్‌గా అన్నట్లు ఓ వీడియోతో విరుష్కకు శుభాకాంక్షలు తెలిపాడు. తన వ్యక్తిగత అఫిషియల్ యాప్‌లో డివిలియర్స్ ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.