విద్యార్థుల మరణాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పట్టడం లేదని, కమిటీలు వేసి చేతులు దులుపుకోవడం చంద్రబాబుకు అలవాటైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలను కొనేందుకు డబ్బులిస్తున్నారు కాబట్టే చంద్రబాబు మంత్రి నారాయణపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో పలువురు నారాయణ సంస్థలో చదువుతున్న విద్యార్థులు ఒత్తిడిలు, యాజమాన్యాల వ్యవహార తీరుతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.