నరసరావుపేటల గురజాలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురజాల వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కాసు మహేష్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ ప్రభుత్వం ఇటీవల పెంచిన ఇంటి పన్నులకు నిరసగా నేడు పిడుగురాళ్ల మున్సిపాలిటీ ముట్టడికి వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ ఇంటి చూట్టు భారీగా చుట్టుముట్టిన పోలీసులు అతన్ని బయటకు రాకుండా గృహ నిర్భంధం చేశారు. మహేష్ అరెస్ట్‌పై వైఎస్సార్‌సీపీ శ్రేణుల భగ్గుమన్నారు. పొద్దునలేస్తే ప్రజాస్వామ్యం పేరుతో గొప్పలు చేప్పుకునే సీఎం చంద్రబాబు.. ప్రశ్నించే వారిని అక్రమంగా అరెస్ట్ చేపిస్తున్నారని మండిపడ్డారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నులు, గతంలో వేసిన రోడ్లకు మళ్లీ టెండర్లు పిలవడంపై వైఎస్సార్‌సీపీ నేడు ధర్నాకు పిలుపునిచ్చింది.
వైఎస్సార్‌సీపీ నేత కాసు మహేష్ హౌస్ అరెస్ట్
Nov 13 2018 7:54 AM | Updated on Mar 20 2024 3:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement