ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 98వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. ఈమేరకు వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. సోమవారం ఉదయం కొనకనమిట్ల మండలం పెద్దారికట్ల శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి చిన్నారికట్ల, చిన్నారికట్ల జంక్షన్, కంభాలపాడు మీదుగా పోతవరం చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.