మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి పార్ధివ దేహాన్ని ఆయన నివాసం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. పార్టీ కార్యాలయంలో దివంగత నేత భౌతిక కాయానికి పెద్దసంఖ్యలో తరలివచ్చిన పార్టీ నేతలు నివాళులు అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు బీజేపీ కార్యాలయంలో దివంగత నేతకు తుది నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 1 గంట వరకూ కడసారి దర్శనం చేసుకునేందుకు ప్రజలను అనుమతిస్తారు. ప్రియతమ నేతకు వీడ్కోలు పలికేందుకు బాధాతప్త హృదయాలతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పార్టీలకతీతంగా జనం పెద్దసంఖ్యలో దేశ రాజధానికి తరలివచ్చారు. ఇక మధ్యాహ్నం నాలుగు గంటలకు దివంగత నేత అంతిమ యాత్ర ప్రారంభమవనుంది. రాష్ర్టీయ స్మృతి స్ధల్‌లో వాజ్‌పేయి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లాల్ బహుదూర్ శాస్ర్తి విజయ్ ఘాట్, నెహ్రూ మెమోరియల్ శాంతి వన్‌ల మధ్య స్మృతి స్థల్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి.
బీజేపీ కార్యాలయానికి వాజ్‌పేయి పార్థివదేహం
Aug 17 2018 11:39 AM | Updated on Mar 21 2024 10:58 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement