భారత రాజకీయాలపై తనదైన ముద్రవేసిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేడు 38వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటున్నది. 1980, ఏప్రిల్ 6న ముంబైలో జరిగిన వేడుకలో అటల్ బిహారీ వాజపేయి(తొలి జాతీయ అధ్యక్షుడు) పార్టీ ఏర్పాటు ప్రకటన చేశారు. ఇప్పుడు అదే ముంబై వేదికగా ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో 38వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. ఇందుకోసం బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగిస్తారు.