ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రకటనలకు భయపడేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. గన్‌పార్క్ వద్ద పోలీసుల అరెస్టు చేసిన ఆర్టీసీ జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి విడుదలై.. తమ కార్మిక సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తీరుపై మండిపడ్డారు.