సీకే దిన్నె పీఎస్ వద్ద ఊద్రిక్తత

యోగివేమన విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. జిల్లా పర్యటనలో భాగంగా వర్సిటీకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడిని విద్యార్థులు అడ్డుకున్నారు. సీఎం గోబ్యాక్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్‌ చేసి సీకే దిన్నె పోలీస్‌ స్టేషన్‌కు తరిలించారు. అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డిలు స్టేషన్‌ ముందు ధర్నాకు దిగారు. దీంతో పీఎస్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక సీఎం వనం-మనం కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీలో మొక్కలు నాటారు. 

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top