సీఎం చంద్రబాబు నాయుడు సుపుత్రుడు, మంత్రి నారా లోకేష్‌కు మంగళగిరిలో చేదు అనుభవం ఎదురైంది. శనివారం మంగళగిరి మండలం ఆత్మకూరుకు ప్రచారానికి వెళ్లిన లోక్‌ష్‌ను సొంతపార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. ప్రచార రథం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పార్టీ జెండాలు చించి, కండువాలు విసిరేసి లోకేష్‌కు వ్యతిరేకంగా టీడీపీ డౌన్ డౌన్.. అంటూ నినాదాలు చేశారు.