తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన మంత్రి నారా లోకేశ్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తొలి నుంచి మంగళగిరిలో లోకేశ్ ప్రచారానికి ఆశించిన మేర స్పందన రావడం లేదు. టీడీపీ పెద్ద ఎత్తున హడావుడి చేసినప్పటికీ.. లోకేశ్ ప్రచారంపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు. తాజగా ఉండవల్లిలో నారా లోకేశ్‌కు చేదు అనుభవనం ఎదురైంది. ప్రచారం నిర్వహిస్తున్న లోకేశ్‌ను ఓ మహిళ నిలదీసింది. భూ సేకరణలో తమ పొలాలు బలవంతంగా లాక్కున్నారని మండిపడ్డారు.