మంగళవారం రోజున మంగళగిరి మండలంలోని నవులూరు, బేతపూడి, నీరుకొండ, కురగల్లు గ్రామాల్లో లోకేశ్ పర్యటించాల్సి ఉంది. అయితే నవులూరులో లోకేశ్ పర్యటనకు స్పందన కరువైంది. కేవలం లోకేశ్ వెంట వచ్చిన కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే ఆ ప్రచారంలో కనిపించారు. నవులూరు గ్రామా ప్రజలు లోకేశ్ పర్యటనపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆయన పర్యటనకు స్పందన లేక.. వీధులన్నీ వెలవెలబోయాయి. దీంతో చేసేదేమీ లేక లోకేశ్, ఆయన అనుచరగణం అక్కడి నుంచి వెనుదిరిగినట్టుగా సమాచారం.