షాకింగ్‌ వీడియో : నాలాలో పడిపోయిన మహిళలు

అప్పటి వరకు పేవ్‌మెంట్‌పై సరదాగా సంభాషిస్తూ నడుచుకుంటూ వెళ్లిన ఇద్దరు మహిళలకు ఊహించని పరిణామం ఎదురైంది. నాలా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఇద్దరూ అందులో పడిపోయారు. ఈ ఘటన టర్కీలోని దియార్బీకిర్‌ సిటీలో చోటుచేసుకుంది. ప్రమదానికి గురైన మహిళల్లో ఒకరు డాక్టర్‌ కాగా మరొకరు నర్సుగా పనిచేస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వీరిద్దరిని స్థానిక ప్రజలు ఆసుపత్రిలో చేర్చారు.కాగా ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డయింది. టర్కీ భద్రతా విభాగం ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనలో మహిళలు ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడటం విశేషం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top