రవిప్రకాశ్ ఆస్ట్రేలియా జారుకున్నట్లు పోలీసుల అనుమానం
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఆస్ట్రేలియాలో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టీవీ9 కాపీ రైట్స్, ట్రేడ్‌మార్క్‌లను కేవలం రూ. 99 వేలకే మీడియా నెక్స్‌ట్ ఇండియా కంపెనీకి బదలాయించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించి అసైన్డ్ డీడీలు అమలు చేశారంటూ అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌పై కేసు నమోదవడం తెలిసిందే. ఈ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్ హాజరుకాకపోవడంతో ఆయన కోసం గాలింపు ముమ్మరం చేశారు.
మరిన్ని వీడియోలు
గరం గరం వార్తలు
వార్తలు
సినిమా
బిజినెస్
క్రీడలు
పుడమి సాక్షిగా