యూరప్‌ను వణికించిన శక్తిమంతమైన తుపాను ఫ్రెడరిక్ ఎట్టకేలకు శాంతించింది. భారీ వర్షాలు, భీకర గాలులతో అతలాకుతలమైన జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం తదితర దేశాలు ఇప్పుడు సాధారణ స్థితికి చేరుకున్నాయి. 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీడయంతో దెబ్బతిన్న రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలను సిబ్బంది పునరుద్ధరిస్తున్నారు. తుపాను ధాటికి తొమ్మిది మంది మరణించగా, భారీగా ఆస్తినష్టం జరిగింది