దేశ రాజధాని న్యూఢిల్లీని మంచుపొగ కమ్మేసింది. దట్టంగా మంచుపొగ అలుముకోవడం, వెలుతురు మందగించడంతో సోమవారం ఉదయం విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. వెలుతురు మరీ మందగించడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వైమానిక సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ఐదు దేశీ విమానాలు, ఏడు అంతర్జాతీయ విమానాలకు అంతరాయం ఏర్పడింది. ఒక విమాన సర్వీస్‌ను రద్దుచేశారు. హస్తినలో వెలుతురు మందగించి.. మంచుపొగ దట్టంగా అలముకోవడంతో ఉదయమైనా చిమ్మచీకటి అలుముకుంది.