ప్రధాని మోదీకి తాను పాదాభివందనం చేశానని ఆరోపణలు చేస్తున్న టీడీపీ ఎంపీ సి.ఎం. రమేశ్‌కు దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. తాను ప్రధానికి పాదాభివందనం చేశానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.