నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు. బకాయిలపై సీఎంకు చాలాసార్లు లేఖలు రాశాను. 2017-2018 సంవత్సరంలో కొత్త నిబంధనలు పెట్టారు. మూడు నెలలకు ఓసారి ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకూ బకాయిలు చెల్లించలేదు. భిక్షం వేసినట్లు కొద్దిగా ఇస్తున్నారు. ఇలాగైతే విద్యార్థులు ఎలా చదవాలి. అధ్యాపకులకు జీతాలు ఎలా చెల్లించాలి. చంద్రబాబు నీవు ఇచ్చిన మాట నిలబెట్టుకో. దాదాపు రూ.19 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంతకాలం ఇలా?. నాకు ఏ కులం లేదు, నేను అందరివాడిని.