రిజర్వేషన్లపై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్‌లుగా ఎస్సీ, ఎస్టీ ఎవరున్న పెత్తనమంతా నాయకులదే అని రిజర్వేషన్లను కించపరిచే విధంగా మాట్లాడారు. గడువు ముగిసిన సర్పంచ్‌లతో బుధవారం విశాఖపట్నంలో ఆయన సమావేశమై మాట్లాడారు. పంచాయతీలో రిజర్వేషన్ల అమలు మామూలు విషయమే అని అన్నారు. మంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడం ఏంటని స్థానికులు ఆశ్చర్యపోయారు.