టెక్‌ దిగ్గజానికి హైకోర్టు ఆదేశాలు | Madras HC Directs Cognizant To Pay Rs 420 Crores To IT Department | Sakshi
Sakshi News home page

టెక్‌ దిగ్గజానికి హైకోర్టు ఆదేశాలు

Apr 4 2018 6:09 PM | Updated on Mar 21 2024 6:45 PM

టెక్‌ దిగ్గజం కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్‌‌, ఐటీ డిపార్ట్‌మెంట్‌కు రూ.420 కోట్ల పన్నును వెంటనే కట్టాలని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. రెండు రోజుల్లో వీటిని చెల్లించాలని పేర్కొంది. రూ.2800 కోట్ల పన్ను ఐటీ డిపార్ట్‌మెంట్‌కు కాగ్నిజెంట్‌ బాకీ పడిందనే ఆరోపణల నేపథ్యంలో, దానిలో 15 శాతం అంటే రూ.420 కోట్లను వెంటనే చెల్లించాలంటూ ఈ ఆదేశాలు జారీచేసింది. దీనికోసం కంపెనీకి చెందిన ముంబైలోని జేపీ మోర్గాన్‌ బ్యాంకు ఖాతాను తిరిగి నడిచేలా చేయాలని కోర్టు పేర్కొంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement