వాయుసేన అమ్ములపొదిలో అపాచీ యుద్ద హెలికాప్టర్లు | Sakshi
Sakshi News home page

వాయుసేన అమ్ములపొదిలో అపాచీ యుద్ద హెలికాప్టర్లు

Published Tue, Sep 3 2019 5:55 PM

భారత వాయుసేన ఆధునీకరణ దిశగా పెద్ద ముందడుగు పడింది. వాయుసేన అమ్ములపొదిలోకి తాజాగా ఎనిమిది అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లు వచ్చి చేరాయి. అమెరికాలో తయారైన అపాచీ ఏహెచ్‌-64ఈ (ఐ) హెలికాప్టర్లు మంగళవారం భారత్‌ చేరాయి. పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో వీటిని వాయుసేన స్వాధీనం చేసుకుంది. వాయుసేనకు చెందిన125 హెలికాప్టర్‌ యూనిట్‌ ’గ్లాడియేటర్స్‌’  ఈ అత్యాధునిక హెలికాప్టర్లు వినియోగించనున్నారు.