హైకోర్టు ఆదేశాలతో గాంధీకి మృతదేహాలు | Disha case: Suspects' bodies shifted to Gandhi Hospital | Sakshi
Sakshi News home page

హైకోర్టు ఆదేశాలతో గాంధీకి మృతదేహాలు

Dec 10 2019 8:17 AM | Updated on Mar 21 2024 11:38 AM

చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌లో మరణించిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలను సోమవారం రాత్రి మహబూబ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలిం చారు. ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కు ల కమిషన్‌ విచారణ చేపట్టడంతో పాటు పలు ప్రజా సంఘాలు కోర్టులో కేసులు వేశాయి. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టడం, ఆ తర్వాత విచారణను గురువారానికి వాయిదా వేయడం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు మధ్య మృతదేహాలను ప్రత్యేక వాహనాల్లో గాంధీ మార్చురీకి తరలించారు. శుక్రవారం వరకు ఇక్కడే భద్రపర్చనున్నారు. మృతదేహాలు కుళ్లిపోకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రి మార్చురీ సమీపంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement