‘ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గు చేటు’

ఓ వ్యక్తి చేసిన నిర్వాకం నెటజన్లను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. అసలు  ఎందుకిలా చేశాడంటూ అనేక మంది అతనిపై మండిపడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటీ అనుకుంటున్నారా? ఢిల్లీలోని రోడ్లపై ఏర్పాటు చేసిన వర్టికల్‌ గార్డెన్‌లో మొక్కల పెంచే కుండీలపై ఓ వ్యక్తి కన్నుపడింది. అవి అతనికి అందంగా కనిపించాయో? లేక అమ్ముకుందామనుకున్నాడో తెలియదు కానీ.. ఆ కుండీల్లోని మొక్కలను అక్కడే పడేసి ఒకటి కాదు రెండు కాదు అనేక కుండీలను దొంగలించి.. ఓ సంచిలో వేసుకొని ఎత్తుకెళ్లాడు. అతడి చేష్టలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఇది గమనించిన సదరు దుండగుడు అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. ‘ఆల్వేజ్ దిల్  సే’ అనే ఫేస్‌బుక్‌ పేజీ పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top