పీఎన్‌బీ స్కాంలో వేగాన్ని పెంచిన సీబీఐ తాజాగా మరోకీలక అరెస్ట్ చేసింది. రూ.11,400 కోట్ల పీఎన్‌బీ కుంభకోణానికి సంబంధించి పంజాబ్ నేషనల్ బ్యాంకు జనరల్ మేనేజర్ ర్యాంక్ అధికారి రాజేష్ జిందాల్‌ను మంగళవారం రాత్రి సీబీఐ అరెస్ట్ చేసింది. 2009 ఆగస్ట్, మే 2011 మధ్య ముంబై బ్రాండీ హౌస్ బ్రాంచ్ హెడ్‌గా రాజేష్ పనిచేశారు. ప్రస్తుతం రాజేష్ ఢిల్లీ బ్రాంచ్‌లో జనరల్ మేనేజర్‌గా ఉన్నారు. ఈయన పదవీకాలంలోనే నీరవ్ మోదీ కంపెనీకి ఎల్‌ఓయూల జారీ ప్రక్రియ ప్రారంభమైనట్టుగా సీబీఐ భావిస్తోంది. ఇప్పటికే బ్యాంకుకు చెందిన పలువురు కీలక అధికారులు, ఇతర కీలక ఉద్యోగులను ప్రశ్నించిన అనంతరం సీబీఐ అరెస్ట్ చేసింది