అనంతపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మార్నింగ్ స్టార్‌కు చెందిన ట్రావెల్ బస్సు పామురాయి గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ప్రమాద సంఘటన తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని జేసీబీ సహాయంతో రోడ్డుకు అడ్డంగా బస్సును పక్కకు తొలగించారు.