కెనడా భారతీయ రెస్టారెంట్లో పేలుడు | Bombing at Ontario Indian Restaurant Wounds at Least a Dozen | Sakshi
Sakshi News home page

కెనడా భారతీయ రెస్టారెంట్లో పేలుడు

May 25 2018 11:55 AM | Updated on Mar 21 2024 8:29 PM

ప్రవాస భారతీయులకు చెందిన రెస్టారెంట్‌లో పేలుడు సంభవించడం కలకలం రేపింది. కెనడా, ఒంటారియోలోని బాంటే భేల్‌ రెస్టారెంట్‌లో జరిగిన ఈ ఘటనలో 18 మందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం రాత్రి 10:30 గంటలకు రెస్టారెంట్‌లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో పలువురు భారతీయులు హోటల్లో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

అయితే జరిగని ఘటన ఉగ్రవాదుల చర్య అని అప్పుడే చెప్పలేమన్నారు కెనడా పోలీసులు. కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టామని వివరించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అనుమానిస్తున్నారు. వారిని అదుపులోకి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. గత నెలలో టొరంటోలో ఓ డ్రైవర్‌ వ్యాన్‌ అద్దెకు తీసుకుని దూసుకెళ్లిన ఘటనలో 10 మంది మృత్యువాత పడగా, మరో 15 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement