ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. తాడేపల్లి గూడెంలో ‘ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల సాధనకై పోరుబాట’ పేరుతో సోమవారం ఉదయం దీక్షను ప్రారంభించారు. తొలుత తెలుగుతల్లికి, బీజేపీ వ్యవస్థాపక నేతలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పైడికొండల మాట్లాడుతూ.. జిల్లాకు ఇచ్చిన 56 హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.