ఇప్పటికే శాఖపరంగా పలు విమర్శలు ఎదుర్కొంటున్న పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ మంత్రి అఖిలప్రియ.. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలతో ఖంగుతిన్నట్లు సమాచారం. కృష్ణానది పవిత్ర సంగమం వద్ద టూరిజం బోటు ప్రమాదంపై ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే 22 మంది చనిపోయారన్న ముఖ్యమంత్రి... గతంలో శాఖపరమైన వైఫల్యాలకు మంత్రులు రాజీనామాలు చేసేవారని కీలక వ్యాఖ్యలు చేశారు.