పురుగుల్ని నమిలి మింగేశాడు.. | Sakshi
Sakshi News home page

పురుగుల్ని నమిలి మింగేశాడు..

Published Thu, Jul 4 2019 10:00 AM

తన వ్యాపారానికి నష్టం కలిగిస్తున్నాయన్న కోపంతో వుసుర్ల(రెక్కల చీమలు)పై విరుచుకుపడ్డాడు. చేతికందిన కాడకి ఆ పురుగుల్ని పరపరా నమిలి మింగేశాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్పీన్స్‌లోని జనరల్‌ శాంతోస్‌ నగరానికి చెందిన రాండీ అలితా ‘పూల్‌ గేమ్‌’ను నిర్వహిస్తున్నాడు. అయితే రాత్రి సమయంలో పూల్‌ టేబుళ్లపై వేలాడదీసి ఉన్న లైట్ల దగ్గరకు భారీ సంఖ్యలో వుసుర్లు చేరుకున్నాయి. ఆట ఆడేందుకు వీలులేకుండా టేబుళ్లపై వాలసాగాయి.