రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కొరకు ఏర్పాటు చేసిన ‘కనెక్ట్ టూ ఆంధ్రా’ వెబ్ పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఈ వెబ్‌పోర్టల్‌ను సీఎం ప్రారంభించారు. దాతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కోసం ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు. దీనికి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, సీఎస్ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ‘కనెక్ట్ టు ఆంధ్రా’ ద్వారా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యం కావాలని గతంలోనే సీఎం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.