ఇటీవల మరణించిన మాజీ ఎమ్యెల్యేలు ఎం. సంజీవరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, బి.సుబ్బారెడ్డిలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సంతాపం తెలిపింది. వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే సభాపతి తమ్మినేని సీతారాం సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాప సూచకంగా సభ్యులంతా తమ స్థానాల్లో లేచి నిలబడి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.