ఓవైపు భారీ సాగునీటి ప్రాజెక్టుల రూప కల్పన, మరోవైపు చిన్న నీటి వనరులను పునరుద్ధరిస్తున్న ప్రభుత్వం.. తాజాగా ఈ రెండింటినీ అనుసంధానం చేసే ప్రణాళికకు పురుడు పోసింది. మిషన్ కాకతీయలో గుర్తించిన ప్రతి చెరువునూ భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింది కాల్వలతో అనుసంధానం చేసి బీడు భూముల న్నింటికీ నీరు పారించే కార్యాచరణను రూపొందిం చింది. వచ్చే ఏడాది ఖరీఫ్‌కు ముందే వీలైనన్ని ఎక్కువ చెరువులను ఈ విధానం ద్వారా నింపాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు నీటి పారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలి విడతగా ఇప్పటికే గుర్తించిన 7,500 గొలుసుకట్టు చెరువులను నింపి మిగతా వాటికి గల అవకాశాలను ‘టోపోషీట్’ల ద్వారా అధ్యయనం చేయనుంది.