అల్లర్లకు గుజరాత్ మరోసారి వేదికైంది. ఇతర రాష్ట్రాల నుంచి పొట్టచేత పట్టుకుని వచ్చి గుజరాత్‌లో ఉపాధి పొందుతున్న వారిపై స్థానికుల దాడులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నుంచి చాలా మంది ఉపాధి కోసం వచ్చి అహ్మదాబాద్, సూరత్, గాంధీనగర్ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరిపై గతవారం రోజులుగా గుజరాతీయులు మూకుమ్మడిగా దాడికి దిగుతున్నారు. వారి వేధింపులను తట్టుకోలేక చాలా మంది సొంత గ్రామాలకు తిరిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో దాడులకు పాల్పడిన 350మందిని పోలీసులు అరెస్ట్ చేసి.. ప్రమాదకరమైన ఏడు జిల్లాల్లో సిబ్బందిని మోహరించారు.