లక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నాగార్జున అక్కినేని కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆఫీసర్. ఈ చిత్రం నుంచి తొలి పాటను కాసేపటి క్రితం దర్శకుడు వర్మ ట్విటర్‌లో రిలీజ్ చేశారు. తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓ చిన్నపాపపై తాను పాటను రూపొందించానని ఆయన చెబుతున్నారు. ‘నవ్వే నువ్వు నవ్వకపోతే.. అంటూ సాగే సాంగ్‌కు రమ్య బెహరా గాత్రం అందించారు.