తొలిసారి బ్యాడ్మింటన్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్లో ఆడుతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తడబడింది. ఇక్కడ నేటి రాత్రి జరిగిన సెమిఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన షట్లర్ సుంగ్ జీ హున్ చేతిలో 15-21, 21-18, 15-21 తేడాతో సింధు ఓటమిపాలైంది. గ్రూపు-బీ నుంచి రెండు విజయాలతో సెమిఫైనల్స్ చేరుకున్న సింధుకు నిరాశే ఎదురైంది.