గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడరని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఆమె శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టులు పూర్తయితే గోదావరి డెల్టాకు ఒక్క చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా.. ముఖ్యమంత్రి మాత్రం కేంద్రాన్ని అడిగలేకపోతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏంటి అనే దానిపై చంద్రబాబు మాట్లాడటం లేదన్నారు.