‘అలక నేతలకు చంద్రబాబు చెబుతున్నదదే’ | ysrcp leader parthasarathy comments on AP cabinet reshuffle | Sakshi
Sakshi News home page

Apr 3 2017 5:33 PM | Updated on Mar 21 2024 7:46 PM

వైఎస్‌ జగన్‌ను, తమ పార్టీని బలహీనం చేయాలని ఏపీ కేబినెట్‌ విస్తరణ చేసినట్టుందని వైఎ‍స్సార్‌ సీపీ నాయకుడు పార్థసారధి అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజలకు మేలు చేసేందుకు కాదు, జగన్‌ ను టార్గెట్‌ చేసేందుకే మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించినట్టుగా ఉందని పేర్కొన్నారు. అలక వహించిన టీడీపీ నాయకులకు చంద్రబాబు అదే విషయాన్ని చెబుతున్నారని తెలిపారు. జగన్‌ కు వస్తున్న ప్రజాదరణ జీర్ణించుకోలేక, ఏదోరకంగా దెబ్బ తీయాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా తమ అను​కూల మీడియాతో దాడి చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement