: ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల స్ఫూర్తితోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని ఆ పార్టీ నేత షర్మిల పునరుద్ధాటించారు. మైనారీటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్సార్ దేనని తెలిపారు. ఎన్నికల రోడ్ షో లో భాగంగా నగరంలో పర్యటిస్తున్న షర్మిలకు సనత్ నగర్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్ జగన్ దీక్షలు చేసిన సంగతి గుర్తు చేశారు. జగన్నను ఆ కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో పెట్టినా ప్రజల కోసం పోరాటం చేశారన్నారు. వైఎస్సార్ పథకాలకు కాంగ్రెస్ తూట్లు పొడిచిందని షర్మిల అన్నారు. ఆయన హయాంలో ఏ ఒక్క ఛార్జీ పెరగలేదని విషయం అందరికీ తెలిసిన విషయమేనన్నారు.