టీవీ ఆర్టిస్ట్‌లను నిలువునా ముంచిన బత్తుల విజయరాణి తన ఇంటి సామాన్లను సైతం సర్ధుకుని లారీలో పారిపోయినట్లు సీసీఎస్ పోలీసుల విచారణలో తేలింది. ఎల్లారెడ్డిగూడలో ఉన్న అద్దె ఇంటిని ఈ నెల 10వ తేదీనే ఖాళీ చేసిందని అక్కడికి వెళ్లిన పోలీసులకు ఇంటి యజమాని తెలిపారు. సామాన్లను తరలించిన లారీ ఎక్కడ నుంచి తెచ్చారో కనిపెడితే ఆమె చిక్కినట్లేనని అధికారులు భావిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న మరో నిందితురాలు మధులత కుమారుడు శ్రీను ఆమె వద్ద వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆమె దగ్గరి కుటుంబ సభ్యులు అందరి ఇళ్లను పోలీసులు గాలించినా అందరి ఇళ్లకు తాళాలు కనిపించాయి. పథకం ప్రకారమే కొడుకు, కోడలుతో పాటు చెల్లెలు, ఇతర బంధువులను ఇతర ప్రాంతాలకు తరలించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా ప్రణాళికతోనే ఆమె పథక రచన చేసినట్లు తెలుస్తుందని ఓ అధికారి తెలిపారు. శ్రీనగర్ కాలనీ, అమీర్‌పేటలో ఆమె నిర్వహిస్తున్న మూడు మెస్‌లను కూడా ఖాళీ చేసిందని పోలీసుల విచారణలో తేలింది.
Mar 17 2014 2:51 PM | Updated on Mar 21 2024 8:10 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement