ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన హోదాను మరిచిపోయి..సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. తుగ్లక్ పాలనలా, పిచ్చోడి చేతిలో రాయిలా కేసీఆర్ పరిపాలన ఉందని ప్రజలు అనుకుంటున్నరని మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వీ హనుమంతరావు ఈ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు.