రాష్ట్రంలో 982 గ్రూప్–2 పోస్టుల భర్తీకి సంబంధించి ఆదివారం ప్రిలిమ్స్(స్క్రీనింగ్ టెస్టు) పరీక్ష జరగనుంది. దీనికి ఏపీతో పాటు తెలంగాణ నుంచి మొత్తం 6,57,010 మంది అభ్యర్థులు హాజరుకానుండగా.. ఏపీలో 1,376 పరీక్ష కేంద్రాలు, తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 86 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు తమ కేంద్రానికి ఉదయం 9 గంటల నుంచి 9.45 లోపు హాజరుకావాలి.
Feb 26 2017 7:09 AM | Updated on Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement